Rajasthan Health Minister Parsadi Lal Meena (Photo/ANI)

Sirohi, April 15: దేశంలో మరో మిస్టరీ వ్యాధి కలకలం రేపుతున్నది. రాజస్థాన్‌లో ఐదు రోజుల్లో ఏడుగురు చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. సిరోహి జిల్లాలోని (Rajasthan’s Sirohi) ఫులాబాయి ఖేడా, ఫులాబెర్ గ్రామాల్లో రెండు నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు అంతుచిక్కని వ్యాధితో (Mysterious disease) చనిపోయారు. ఈ నెల 9 నుంచి 13 వరకు జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలతో ఏడుగురు పిల్లలు మరణించినట్లు ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జగేశ్వర ప్రసాద్ తెలిపారు. చిన్నారుల మృతికి కారణం ఏమిటన్నది తెలియలేదని చెప్పారు.

వైరల్‌ డిసీజ్‌ కారణం కావచ్చని, అయితే రక్త నమూనాల పరీక్షల రిపోర్టులు వస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారు. కాగా, ఈ మిస్టరీ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించిన ఒక రోజులోనే చనిపోయినట్లు (kills 7 kids in 5 days) ప్రసాద్ తెలిపారు. ఐదేండ్ల కుమారుడు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి మంచినీరు అడిగాడని, అనంతరం అతడికి మూర్ఛ వచ్చినట్లు తల్లి తెలిపిందన్నారు. ఉదయం 8 గంటలకు వాంతుల తర్వాత పిల్లవాడు చనిపోయినట్లు ఆమె చెప్పిందన్నారు.

రాముడి అసలు దేవుడే కాదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్‌ మాజీ సీఎం జితిన్‌ రాం మాంఝీ, తుల‌సీదాస్‌, వాల్మీకి తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్య‌లు

మరోవైపు మరణించిన ఏడుగురు పిల్లల్లో ముగ్గురు స్థానికంగా తయారు చేసిన ఐస్‌ తిన్నట్లు తమకు తెలిసిందని ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జగేశ్వర ప్రసాద్ తెలిపారు. మరో ఇద్దరు కూడా ఆ ఐస్‌ తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారని, అయితే ఎవరూ దీనిని చూడలేదన్నారు. విషాహారం వల్ల కూడా ఇంత వేగంగా మరణాలు సంభవించవని ఆయన అభిప్రాయపడ్డారు. జైపూర్‌, జోధ్‌పూర్‌ నుంచి వైద్య బృందాలను ఆయా గ్రామాలకు పంపుతున్నట్లు సిరోహి జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పరిస్థితిని గమనిస్తున్నామని, 300 ఇళ్ల నుంచి 58 మంది పిల్లల రక్త నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.