రాముడి విషయంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్లను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తినరు, ముట్టుకోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
#WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1
— ANI (@ANI) April 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)