RIL AGM 2022: మరో రంగంలోకి అడుగుపెడుతున్న జియో, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్‌ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపిన ఈషా అంబానీ

ఏజీఎం సమావేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్‌ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్‌ మెగా ఈవెంట్‌లో ప్రకటన వెలువడింది.

Reliance Jio (Photo Credits: Twitter)

జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన రిలయన్స్‌ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. ఏజీఎం సమావేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్‌ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్‌ మెగా ఈవెంట్‌లో ప్రకటన వెలువడింది.కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు.హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్‌ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు.