Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది, ఫ్లయింగ్ ఫ్లీ సి6 పేరుతో 2026 జనవరిలో మార్కెట్లోకి..
మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ కింద విడుదల చేస్తారు
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) విద్యుత్ ద్విచక్ర వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ కింద విడుదల చేస్తారు.ఫ్లయింగ్ ఫ్లీ సీ6 అనేది రెట్రో- ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఇది రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్‌లతో రానుంది. ఇందులో ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో రానున్నట్లు తెలుస్తోంది.
బెంజ్ కార్ అభిమానులకు షాకింగ్ న్యూస్, జనవరి నుంచి 3 శాతం పెరగనున్న ధరలు
ఈ విద్యుత్ బైక్‌లో రెండు సీట్ల వెర్షన్లు కూడా ఉండనున్నట్లు అంచనా. ఇక టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో రానుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 100-150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బైక్ 2026లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.కాగా కొత్త ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ 1940ల నాటి అసలు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొందింది. ఫ్లయింగ్ ఫ్లీ C6 యొక్క రెండు-సీట్ల వెర్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం 1 సీటు వర్షన్ తో వస్తోంది.