Interest-Free Festival Advance: వడ్డీ లేకుండా పది వేల రూపాయల రుణం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దివాళీ బొనాంజా ప్రకటించిన మోదీ సర్కార్, ఎల్‌టీసీ క్యాష్ వోచర్, స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌లను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సోమవారం పలు చర్యలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎల్‌టీసీ క్యాష్ వోచర్, స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌లను (Interest-Free Festival Advance) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని, డిజిటల్ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ ఇన్వాయిస్‌ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
New Delhi, October 12: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ సర్కార్ దివాళీ బొనాంజా ప్రకటించింది. కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సోమవారం పలు చర్యలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎల్‌టీసీ క్యాష్ వోచర్, స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌లను (Interest-Free Festival Advance) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని, డిజిటల్ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ ఇన్వాయిస్‌ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
కరోనా వైరస్‌తో (Coronavirus) ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ప్రకటించగా తాజాగా వ్యవస్థలో డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలను ప్రకటించామని ఆర్థిక మంత్రి చెప్పారు.ట్రావెల్ క్యాష్ వోచర్లతో ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకోవచ్చని, మూడింతలు టికెట్ ధరను కూడా తీసుకోవచ్చని తెలిపారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌తో 12 శాతం జీఎస్టీ ఉండే వస్తువులను కొనుగోలు చేయవచ్చు అన్నారు.
కేవలం డిజిటల్ లావాదేవీలను మాత్రమే ఇందులో ప్రోత్సహించనున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆప్షన్ వాడుకుంటే, అప్పుడు ప్రభుత్వానికి 5675 కోట్లు ఖర్చు కానున్నది. పీఎస్‌బీ, పీఎస్‌యూలకు 1900 కోట్లు ఖర్చు కానున్నది. ఇక నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీ లేని పది వేల రుణం ఇవ్వనున్నారు. ప్రీపెయిడ్ రూపేకార్డు రూపంలో ఆ అమౌంట్ ఇస్తారు.
వచ్చే ఏడాది 31వ తేదీలోగా ఆ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వంపై సుమారు 4000 కోట్లు భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే స్కీమ్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే అదనంగా మరో 8000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పండుగ వేళ ఉద్యోగులు ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చు. కాగా వస్తువులను కొనుగోలు చేయడానికి వోచర్లు వాడే అవకాశం కల్పిస్తున్నామని, తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్‌టీసీ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
వీటిపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో దూకుడు పెంచేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం విషయంపై సోమవారం మద్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సమావేశంలో పాల్గొంటారు.