Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై బీజేపీలో చీలిక, కర్ణాటక బాలికకే సపోర్ట్ చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ లోని ఓ వర్గం, హిజాబ్ ధరిస్తే తప్పేంటని ప్రశ్న
హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ ముస్లిం యువతులు (Karnataka girl) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. వారికి బీజేపీకి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch ) మద్దతు తెలిపింది. ఆర్ఎస్‌ఎస్ లో ముస్లిం విభాగమైన రాష్ట్రీయ మంచ్ నేతలు...కర్ణాటకలో ఆందోళన చేస్తున్న యువతులకు మద్దతు పలికారు.
Ayodhya, February 10: కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై (Hijab row) బీజేపీలో చీలిక వచ్చింది. హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ ముస్లిం యువతులు (Karnataka girl) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. వారికి బీజేపీకి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch ) మద్దతు తెలిపింది. ఆర్ఎస్‌ఎస్ లో (Rashtriya Swayamsevak Sangh (RSS) ముస్లిం విభాగమైన రాష్ట్రీయ మంచ్ నేతలు...కర్ణాటకలో ఆందోళన చేస్తున్న యువతులకు మద్దతు పలికారు. ముఖ్యంగా ఉడిపిలో కాషాయ కండువాలు ధరించి జై శ్రీరామ్ (Jai Shri Ram) నినాదాలు చేసిన వారికి ధీటుగా జవాబిచ్చిన బీబీ ముస్కాన్ ఖాన్ (Bibi Muskan Khan) కు అభినందనలు తెలిపారు ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేత అనిల్ సింగ్ (Anil Singh), అవధ్ ప్రంత్ లు (Avadh prant ) ఆమె ధైర్య సాహసాలను కొనియాడారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఆ యువతులకే మద్దతుగా నిలుస్తామని, హిజాబ్ ధరించడం కూడా భారతీయ సాంప్రదాయంలో భాగమేనన్నారు. అంతేకాదు మహిళలను గౌరవించడం హిందూ సాంప్రదాయమని (Hindu culture), కానీ కర్ణాటకలో యువతులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం సరికాదన్నారు.
అయితే హిజాబ్ (Hijab) ధరించడమనేది రాజ్యాంగం ఆమెకు ఇచ్చిన స్వేచ్ఛ అంటున్నారు నేతలు, కానీ ఒకవేళ క్యాంపస్ డ్రస్ కోడ్ ను ఉల్లంఘిస్తే...ఆమెపై చర్యలు తీసుకునే అధికారం ఆ కాలేజీ యాజమాన్యానికి ఉంటుందన్నారు. అలా కాకుండా కాషాయ కండవాలు వేసుకొని...జై శ్రీరాం నినాదాలు చేస్తూ యువతులను ఇబ్బంది పెట్టడం మాత్రం ఏ మాత్రం అంగీకారం కాదన్నారు. వారంతా హిందూ సాంప్రదాయాన్ని కించపరిచేలా వ్యవహరించారన్నారు ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతలు. హిందూ, ముస్లింలు సోదరీ, సోదరీమణుల్లాంటి వారని, అందరం భరతమాత ముద్దు బిడ్డలమే అంటున్నారు.