Same-Sex Marriage: పెళ్లి చేసుకోవాలంటే మగ, ఆడ అవసరమా, శారీరక సంబంధం కోసమే పెళ్లి చేసుకుంటారా, న్యాయవాదులను ప్రశ్నించిన సీజేఐ డివై చంద్రచూడ్

స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాహానికి స్త్రీ, పురుషుడు అవసరమా అని ప్రశ్నించారు. ఈ (స్వలింగ) సంబంధాలను (Same-Sex Marriage) మనం శారీరక సంబంధాలుగానే కాకుండా స్థిరమైన, భావోద్వేగ సంబంధంగా చూస్తామని ఆయన అన్నారు.

DY Chandrachud (File Image)

New Delhi, April 20: స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాహానికి స్త్రీ, పురుషుడు అవసరమా అని ప్రశ్నించారు. ఈ (స్వలింగ) సంబంధాలను (Same-Sex Marriage) మనం శారీరక సంబంధాలుగానే కాకుండా స్థిరమైన, భావోద్వేగ సంబంధంగా చూస్తామని ఆయన అన్నారు.

ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మూడో రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ( CJI DY Chandrachud) ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను కోర్టు వెబ్‌సైట్, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్‌, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ఉన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన దాదాపు 15 పిటిషన్ల దాఖలు అయ్యాయి.

స్వలింగ వివాహాలపై రెండో రోజు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనలు, విచారణలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలని కోరిన కేంద్రం

జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం మాట్లాడుతూ, స్వలింగ వ్యక్తుల మధ్య సంబంధం కేవలం శారీరకపరమైనది కాదని, అంతకన్నా ఎక్కువగా నిలకడగల, భావోద్వేగపరమైన సంబంధమని తాము భావిస్తున్నామన్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలంటే, పెళ్లి యొక్క పరిణామ భావాన్ని పునర్నిర్వచించవలసి ఉంటుందన్నారు. ఎందుకంటే, పెళ్లి చేసుకోవడానికి భాగస్వాములు లింగ పరంగా వేర్వేరు జాతులకు చెందినవారు (స్త్రీ, పురుషులు) ఉండవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం భార్యాభర్తలుగా కేవలం స్త్రీ పురుషులు మాత్రమే ఉన్నారు. వివాహానికి స్త్రీ, పురుషుడు అవసరమా అని క్వశ్చన్ చేశారు.

స్వ‌లింగ సంప‌ర్కుల మ్యారేజ్‌, జననాంగాలకు సంబంధం లేదని తెలిపిన సుప్రీంకోర్టు, గే పెళ్లిళ్ల పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు

1954లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చిందని, ఆ తర్వాత 69 సంవత్సరాల నుంచి చట్టం చెప్పుకోదగ్గ రీతిలో పరిణామం చెందిందని తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారు తమ వ్యక్తిగత చట్టాలను పాటించకూడదని భావిస్తే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవడానికి అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

హోమోసెక్సువాలిటీ నేరం కాదని 2018లో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సీజేఐ ప్రస్తావించారు. పరస్పరం ఇష్టపడే స్వలింగ వయోజన వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఈ తీర్పు ద్వారా గుర్తించామన్నారు. అంతేకాకుండా ఇటువంటివారి మధ్య సంబంధం నిలకడగా ఉన్నట్లు కూడా గుర్తించామన్నారు. ట్రోలింగ్ జరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, సార్వజనీనంగా చెల్లుబాటయ్యే సిద్ధాంతాలేవీ ఉండవన్నారు.

స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకున్నపుడు, వారి పిల్లలు గృహ హింసను చూస్తున్నపుడు జరిగేదేమిటని ప్రశ్నించారు. అటువంటి పిల్లలు సాధారణ వాతవరణంలో పెరుగుతారా? అని ప్రశ్నించారు. మద్యానికి బానిసైన తండ్రి ఇంటికొచ్చి, రోజూ రాత్రి తన తల్లిని కొడుతూ ఉంటే, మద్యం కోసం డబ్బులు అడుగుతూ ఉంటే, ఆ పరిస్థితిని చూసే పిల్లలు సాధారణ వాతావరణంలో పెరుగుతారా? అని ప్రశ్నించారు.

స్వలింగ వివాహాలు చేసుకుంటే పిల్లలు పుట్టడం సాధ్యం కాదని న్యాయవాదులు వాదించినపుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, స్త్రీ, పురుషులు వివాహం చేసుకున్నపుడు కూడా, నేటి కాలంలో విద్యా వ్యాప్తి జరగడంతోపాటు, ఆధునిక కాలపు ఒత్తిళ్లు కూడా పెరిగాయని, ఫలితంగా దంపతులు పిల్లలు లేకుండా అయినా ఉండిపోతున్నారని, కేవలం ఒకే బిడ్డను కనడమైనా చేస్తున్నారని అన్నారు. కొడుకు తప్పనిసరిగా ఉండాలనే భావం నుంచి దూరమవుతున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషన్లను తోసిపుచ్చాలని కోరుతోంది. పిటిషనర్లు పట్టణ ఉన్నత వర్గాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. దీనిపై చర్చించేందుకు సరైన వేదిక పార్లమెంటేనని చెప్పింది. చట్టసభలు విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని తెలిపింది. భారతీయ కుటుంబాల్లో భర్త, భార్య, పిల్లలు ఉంటారని, ఇటువంటి కుటుంబంతో స్వలింగ వ్యక్తుల పెళ్లిని పోల్చకూడదని తెలిపిందని ధర్మాసనం తెలిపింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లేకపోతే, అనేక హక్కులను వినియోగించుకోవడం సాధ్యం కాదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. మెడికల్ కన్సెంట్, పింఛన్లు, పిల్లలను దత్తత తీసుకోవడం, క్లబ్ మెంబర్‌షిప్ వంటి హక్కులను పొందలేకపోతున్నట్లు తెలిపారు.పిటిషనర్ల తరపు వాదనలు సోమవారంతో ముగుస్తాయని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఈ గడువులోగా వాదనలను పూర్తి చేయడానికి తమలో తాము చర్చించుకోవాలని న్యాయవాదులను కోరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now