Same Sex Marriages: స్వలింగ వివాహాలను న్యాయవ్యవస్థ గుర్తించదు, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా
హిందూ వివాహ చట్టం (హెచ్‌ఎంఏ), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్‌ల (Chief Justice D N Patel, Justice Prateek Jalan)ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ వాదనను వినిపించారు.
New Delhi, Sep 14: భారత దేశంలో స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం అలాగే మన విలువలు గుర్తించలేదని (Same sex marriages not recognised by our laws) కాబట్టి ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (హెచ్‌ఎంఏ), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్‌ల (Chief Justice D N Patel, Justice Prateek Jalan)ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ వాదనను వినిపించారు.
స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని పేర్కొంటూ ఈ తరహా వివాహాలకు అనుమతిస్తూ పిటిషనర్ కోరిన ఊరటను కల్పించడాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General (SG) Tushar Mehta) వ్యతిరేకించారు. ఈ తరహా వివాహాలను చట్టబద్ధం చేయాలని, ఊరట కల్పించాలని పిటిషనర్ కోరారని ఇందుకు అనుమతిస్తే ఇది పలు చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందని మొహతా అన్నారు.
హిందూ వివాహ చట్టంలో (Hindu Marriage Act (HMA) వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్య, భర్తల గురించి ప్రస్తావించామని స్వలింగ జంటల్లో ఈ పాత్రలను ఎలా చూస్తారని మెహతా కోర్టును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని, అయితే అవి భారత్‌కు వర్తించవచ్చు..వర్తింపకపోవచ్చని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసులో పిటిషన్ అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది.
స్వలింగ సంపర్కానికి ప్రభావితమయ్యే వారు బాగా చదువుకున్నవారని వారు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని పటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్క చర్యలను సుప్రీంకోర్టు నేరపూరిత స్వభావం నుంచి తొలగించినా స్వలింగ జంటల వివాహాలు ఇప్పటికీ సాధ్యం కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది అభిజిత్ అయ్యర్ మిత్రా వాదించారు. ఇక స్వలింగ వివాహాన్ని రిజిస్టర్ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభిజిత్ అయ్యర్ మిత్రాను కోర్టు కోరింది. తదుపరి విచారణను అక్టోబర్ 21కి హైకోర్టు వాయిదా వేసింది.