SBI Chairman Salary: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా వేతనం ఎంతో తెలుసా, దేశంలో ఏ బ్యాంకర్ వేతనం అత్యధికంగా ఉందంటే..?

ఆయన దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకడు, ఆయన SBIకు చెందిన రూ. 28.18 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆస్తులను (AUM) పర్యవేక్షించడం, సంవత్సరానికి సుమారు రూ. 50,000 కోట్ల రుణాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలను ఆయన కలిగి ఉన్నాడు.

sbi chairman

SBI Chairman Salary: దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి దినేష్ ఖరా చైర్మన్ గా ఉన్నారు. ఆయన దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకడు, ఆయన SBIకు చెందిన రూ. 28.18 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆస్తులను (AUM) పర్యవేక్షించడం, సంవత్సరానికి సుమారు రూ. 50,000 కోట్ల రుణాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలను ఆయన కలిగి ఉన్నాడు. మరి అంత పెద్ద బ్యాంకర్ జీతం ఎంతో తెలుసా... 2022 ఆర్థిక సంవత్సరంలో దినేష్ ఖరా వార్షిక వేతనం రూ.34 లక్షలు. మాత్రమే అంటే నెలకు దాదాపు 3 లక్షలు మాత్రమే.

నేటి పరిస్థితుల్లో 34 లక్షల వార్షిక వేతనం అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు ప్రైవేట్ రంగ బ్యాంకుల చీఫ్‌లతో పోల్చితే మాత్రం ఇది చాలా తక్కువే. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ కెకి మిస్త్రీ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 19 కోట్ల జీతం తీసుకున్నారు. HDFC నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 6.53 లక్షల కోట్లు, ఇది స్టేట్ బ్యాంక్ కంటే చాలా తక్కువ.

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి

ఐసిఐసిఐ బ్యాంక్‌ను మినహాయిస్తే, 2021 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని టాప్-5 బ్యాంకుల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఏటా రూ. 2.3 కోట్ల నుంచి రూ. 7.1 కోట్ల రేంజ్‌లో ఉన్నారు. అన్ని ప్రైవేట్ బ్యాంకులు 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు.

యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, CEO అయిన అమితాబ్ చౌదరి, FY21లో రూ. 3.8 కోట్ల వేతనం, రూ. 10 లక్షల లీవ్ ఫెయిర్ కన్సెషన్ సౌకర్యం, రూ. 1.07 కోట్ల ఇంటి అద్దె అలవెన్స్. రూ. 84 లక్షల విలువైన ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌లను అందుకున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ ఎండీ దీపక్ గుప్తా రూ.1.8 కోట్ల వేతనంతో పాటు రూ.1.5 కోట్ల వార్షిక ప్రోత్సాహకం అందుకున్నారు.