TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి
Representational Image | File Photo

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు (TS Inter Results 2022) జూన్ 15 విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. రేపు ఫలితాలు విడుదల (TS Inter Results 2022 Release Date) అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని, ఇటువంటి ప్రచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మవద్దని చెప్పింది. ఇప్పటివరకు ఫలితాల విడుదల తేదీని నిర్ణయించలేదని తెలిపింది. ఫలితాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 25 తర్వాతే ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల పేపర్ కరెక్షన్ ముగియనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోస్టు వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక, ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు.

టెన్త్‌ ఫెయిల్‌ అయిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్, రోజుకు 2 సబ్జెక్టుల్లో కోచింగ్‌, 13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన

మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు.. ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తి కావడంతో.. పోస్టు వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.