Sankranti Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్య పెంపు, పండగ సీజన్‌కు ప్లాట్‌ఫాం ధరలనూ రెట్టింపు చేసిన రైల్వే శాఖ
10 నుంచి రూ.20కి పెంచారు. జనవరి 9 నుంచి 20 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.....
Secunderabad, January 10: సంక్రాంతి పండగ (Sankranti Festival) సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించింది.
సికింద్రాబాద్-రాక్సాల్ స్పెషల్ జనవరి 14 మరియు 21 తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 9.40 గంటలకు బయలుదేరుతుంది; ఇదే రైలు (07092) జనవరి 17, 24 మరియు 31వ తేదీల్లో రాక్సాల్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభమవుతుంది.
సికింద్రాబాద్-గౌహతి స్పెషల్ (02513) జనవరి 16, 23 మరియు 30 తేదీలలో ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది; తిరుగు ప్రయాణంలో, ఇదే రైలు నం. 02514 జనవరి 18, 25 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో రాత్రి 11.55 గంటలకు గౌహతి నుంచి బయలుదేరుతుంది.
సికింద్రాబాద్-గుడూర్ సువిధ స్పెషల్ (82740) జనవరి 10 న ఉదయం 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు గూడూర్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-మచిలిపట్నం సువిద స్పెషల్ (82743) జనవరి 11న రాత్రి 9:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు మచిలిపట్నం చేరుకుంటుంది.
అలాగే కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్యను పెంచారు. 67250/67249 సికింద్రాబాద్-తాండూర్-సికింద్రాబాద్ నడిచే MEMU ప్యాసెంజర్ అదనపు రైలు సాయంత్రం సికింద్రాబాద్ నుండి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు చిట్టాపూర్ వయా తాండూర్ చేరుకుంటుంది.
మరొకటి చిటాపూర్-సికింద్రాబాద్ MEMU ఉదయం ఉదయం 4.30 గంటలకు చిట్టాపూర్ నుండి బయలుదేరి, ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక పనిలోపనిగా సికింద్రాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను రూ. 10 నుంచి రూ.20కి పెంచారు. జనవరి 9 నుంచి 20 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.