Farmers' protest: ప్రభుత్వానికి మరోసారి చెమటలు పట్టిస్తున్న రైతుల ఆందోళన, ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు, భారీగా పోలీసుల మోహరింపు, ఇంటర్నెట్ నిలిపివేత, పలు ఆంక్షలు

దీనిపై రైతు నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌ దాలెవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే..హర్యానాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు

Farmers' protest (PIC@ ANI X)

New Delhi, FEB 11: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు ఆందోళనకు (Farmers' protest) పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ(Delhi)లో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల 13న దాదాపు 200 రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ (Delhi Chalo) కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని హర్యానా పోలీసులు సూచించారు. అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో సెక్షన్‌ 144ను విధించారు. పోలీసు శాఖ సూచనలు అనుసరించి.. ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని కోరారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు.

 

ఇక దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల (Delhi borders) వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. పంజాబ్‌, హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను సిద్ధం చేశారు. ఒక వేళ రైతులు నగరంలోకి రావాలని యత్నిస్తే.. వీటిని వాడి సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు. కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా వంటివి కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి.

 

దీనిపై రైతు నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌ దాలెవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే..హర్యానాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ‘‘సరిహద్దులు మూసేశారు. 144వ సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా..? ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టాలి’’ అని అన్నారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు