IPL Auction 2025 Live

Oxford COVID-19 Vaccine: శుభవార్త..ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌‌కు అనుమతి, ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని కచ్చితంగా అందించాలని స్పష్టం చేసిన డీసీజీఐ

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (Serum Institute of India) అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దేశంలో ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ (Oxford COVID-19 Vaccine) పరీక్షలకు అనుమతినిచ్చింది.

Coronavirus Vaccine (Photo Credits: ANI)

New Delhi, Sep 16: కరోనా వ్యాక్సిన్ తీసుకురావడంలో ముందున్న ఇండియాకు ఇది నిజంగా శుభవార్తేనని చెప్పవచ్చు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (Serum Institute of India) అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దేశంలో ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ (Oxford COVID-19 Vaccine) పరీక్షలకు అనుమతినిచ్చింది.

ప్రోటోకాల్ ప్రకారం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని కచ్చితంగా అందించాలని డీసీజీఐ (DCGI) స్పష్టం దేశంలో రోజుకు 90 వేలకు పైగా కేసులతో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కావడం కాస్త ఊరటినచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఇటీవల ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌ను సైడక్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని బ్రిటన్ లో నిలిపివేసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వ్యాక్సిన్ రెండు, మూడు క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయాలని డీసీజీఐ ఈ నెల 11న సీరంను ఆదేశించింది. అయితే విదేశాల్లో అనుమతి లభించిన నేపథ్యంలో తాజా అనుమతిని డా.వి.జి.సొమానీ మంగళవారం మంజూరుచేశారు. అయితే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సూచించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన మందుల జాబితాతో పాటు ఇతర చికిత్సా వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించారు.

కరోనా రెండోసారి వస్తే సీరియస్ ఏమి కాదు, దేశంలో తాజాగా 90,123 మందికి కరోనా, 50,20,360 కు చేరుకున్న మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, 82,961 కు చేరిన మరణాల సంఖ్య

కాగా బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కోవిడ్ వాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దేశీయంగా ఆ వాక్సిన్‌ ఉత్పత్తికి పుణేకు చెందిన సీరం ఇన్నస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. మూడవ దశ ఫలితాల్లో సమస్యల కారణంగా ఇండియా సహా, బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసింది.ఇటీవల బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ అనుమతి లభించడంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది.