Arvind Kejriwal Bail Hearing: కేజ్రీవాల్‌ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హౌస్ రెవిన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది.ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది.

Arvind Kejriwal

New Delhi, june 21: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హౌస్ రెవిన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది.ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది.ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కగా.. ఎట్టకేలకు గురువారం (20/06/24) ట్రయల్ కోర్టు ఆయనకు రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్ష్యుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సూచించింది.

ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కగా.. ఎట్టకేలకు గురువారం (20/06/24) ట్రయల్ కోర్టు ఆయనకు రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్ష్యుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సూచించింది.

ఈ కేసులో ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని న్యాయవాది వాదించడంతో.. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ను విడుదల చేయొచ్చని పేర్కొంది. అయితే.. ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. శుక్రవారం రోజే దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈలోపు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.  మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్, లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన రౌస్‌ అవెన్యూ కోర్టు

దీంతో.. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. కాగా.. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో ఈడీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ బెయిల్‌ని వ్యతిరేకించేందుకు తమకు సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనలు వినిపించే సరిపడా సమయమూ ఇవ్వలేదన్న ఆయన.. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif