Yugendra Pawar to Contest From Baramati: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు, బారామతి నుంచి అజిత్ పవార్ పై బరిలోకి దిగుతున్న శరద్ పవార్ మనువడు
పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది.
Pune, OCT 24: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Elections) కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతిలో నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పోటీ చేస్తుండగా..ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ-ఎస్పీ) పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ 45 మంది అభ్యర్థుల జాబితాలో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్ పేరు (Yugendra Pawar) సైతం ఉంది. పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది.
Yugendra Pawar to Contest From Baramati
లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ను (Sunetra pawar) బరిలోకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. ఇప్పుడు తాజా అజిత్ పవార్‌పై తన మనవడు శరద్‌పవార్‌ను పోటీకి దించడం సంచలనంగా మారింది.