Sharmila On Vijayasai Reddy Resignation: విశ్వసనీయత కొల్పోయిన జగన్.. అందుకే వీసా రెడ్డి రాజీనామా, బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించిన వైఎస్ షర్మిల

వైఎస్ జగన్‌కి విజయసాయి రెడ్డి చేసి పెట్టని పని అంటూ ఏదీ లేదు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). రాజకీయంగానే కాదు..

Ys Sharmila On vijayasai Reddy Resignation, slams jagan(X)

Vij, Jan 25: వైఎస్ జగన్‌కి విజయసాయి రెడ్డి చేసి పెట్టని పని అంటూ ఏదీ లేదు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా జగన్‌కి ఆయన ఎన్నో చేసి పెట్టారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీకి రాజీనామా(Sharmila On Vijayasai Reddy Resignation) చేయడం చిన్న విషయం కాదు అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే ఆయన రాజీనామా చేశాడు అని విమర్శించారు.

ఇక సాయిరెడ్డికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జగనే.. గతంలో ఆయన ఎన్నో అసత్యాలు చెప్పారని ఇప్పటికైనా ఆ నిజాలన్నీ బయటపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.

తన కుటుంబం, తన పిల్లల మీద విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని దుయ్యబట్టారు.జగన్(YS Jagan) నాయకుడిగా ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయారని అన్నారు. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీ(Modi)కి జగన్ దత్త పుత్రుడని విమర్శించారు.

మాజీ మంత్రి వివేకా కేసులో కూడా జగన్ చెప్పమన్న విధంగా అబద్దాలు చెప్పారన్నారు. వీసా రెడ్డి అన్నీ నిజాలు చెబితే.. ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్(Super Six) హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు షర్మిల. తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15 వేలు అన్నారని.. కానీ రాష్ట్రంలో ఒక్క బిడ్డకైనా మీరు డబ్బులు ఇచ్చారా అని నిలదీశారు.  విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు.. నాయకుడిపై నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు, వైసీపీలో పరిస్థితికి ఇదే నిదర్శనం అని కామెంట్ 

దేశంలోనే నిరుద్యోగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని కానీ వారికి చంద్రబాబు చెప్పిన ప్రకారం నిరుద్యోగ భృతి అందడం లేదన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ అని‌ చంద్రబాబు ప్రకటించారని కానీ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: సూపర్‌ సిక్స్‌ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన

Kishan Reddy Met Balakrishna: బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు భాలయ్య పూర్తిగా అర్హులంటూ అల్లు అర్జున్ ట్వీట్

Telangana: తెలంగాణలో అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలు అమలు, రైతుభరోసా కింద తొలి విడతగా రూ. 6 వేలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Share Now