Techie Suicide in Hyderabad: పని ఒత్తిడి తాళలేక, చేసిన అప్పులు తీర్చలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది.
Hyderabad, Oct 25: పని ఒత్తిడి తాళలేక (Work Pressure), చేసిన అప్పులు తీర్చలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (Software Engineer) ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ కోకాపేటలో హాస్టల్ లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి హాస్టల్ గదికి వచ్చిన ఆయన ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)
అందుకేనా??
ప్రభాకర్ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా బాధితుడికి అప్పులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.