Sonali Phogat Murder Case: రెండు గంటలు టాయ్‌లెట్లో ఆ నటిని వారిద్దరు ఏం చేశారు, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌‌కు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి చంపారని తెలిపిన గోవా ఐజీ

సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ( BJP Leader and TikTok Star Forcibly Drugged) ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.

Late BJP Leader Sonali Phogat (Photo/ANI)

Panaji, August 26: బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్, నటి సోనాలి ఫోగట్‌ అనుమానాస్పద మృతి కేసు (Sonali Phogat Murder Case) రోజుకో మలుపు తిరుగుతోంది. సోనాలి ఫోగట్​ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్లు భావించగా.. తరువాత సోనాలిది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో గోవా పోలీసులు మర్డర్‌ కేసు నమోదు చేశారు.

తాజాగా ఆమె డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్‌ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ( BJP Leader and TikTok Star Forcibly Drugged) ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.అక్కడి రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని (Drugged With Chemical Before She Died) ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటల పాటు ఉన్నారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌, నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడించారు.ఈ మేరకు గోవా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ శుక్రవారం మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు.

వాళ్లే పానీయంలో విష పదార్థం కలిపి ఆమెను చంపేశారు, నటి సోనాల్‌ ఫోగట్‌ హత్య మిస్టరీలో కీలక విషయాన్ని వెల్లడించిన గోవా ఐజీపీ

సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం.. సోనాలీ సహాయకులు సుధీర్‌ సాగవాన్‌, సుఖ్వీందర్ వాసి ఆమెతో కలిసి క్లబ్‌లో పార్టీ చేసుకున్నారు. వారిలో ఒకరు ఆమెతో బలవంతగా ఓ పదార్థాన్ని తాగించారు.డ్రింక్‌ తాగిన తర్వాత ఆమె తనపై తాను కంట్రోల్‌ తప్పిందని తెలిపారు. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు తనను టాయిలెట్‌లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే తరువాత రెండు గంటలపాటు ఏం చేశారనే దానిపై వివరణ లేదన్నారు.

నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీని గురించి నిందితుల్ని ఆరాతీయగా.. ఉద్దేశపూర్వకంగానే ఆమెతో ప్రమాదకరమైన రసాయనాన్ని తాగించామని అంగీకరించారు. రెండు గంటల పాటు టాయిలెట్‌లో ఏం జరిగిందో మాత్రం వారు నోరు విప్పలేదు. ఆ ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశాం. త్వరలో వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నాం. అయితే ఆమె వారిచ్చిన డ్రగ్స్‌ కారణంగానే మరణించినట్లు తెలుస్తోంది’ అని పోలీసు అధికారి తెలిపారు. డ్రగ్స్‌ ప్రభావంతోనే సోనాలి మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు.

బీజేపీ నేత సోనాల్‌ ఫోగట్‌ నైట్ క్లబ్ వీడియో వైరల్, చనిపోయే రెండు నెలల ముందు పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో డ్యాన్స్

గోవా పర్యటనలో ఉన్న ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం సోనాలీ ఫోగాట్‌ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెతో పాటు ఉన్న ఆ సహాయకులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.సోనాలీ అనుమానాస్పద మృతి వెనక హరియాణాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదని ఆమె సోదరుడు రింకూ తెలిపారు.

మాజీ టిక్‌టాక్‌ స్టార్‌గా, ‘బిగ్‌బాస్‌’ టీవీ రియాలిటీ షో ద్వారా ప్రాచుర్యం పొందిన సోనాలీ ..2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. సోనాలీ మృతి పట్ల ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహా పలు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందట మృతిచెందారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 9లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చనిపోయే రోజు కొన్ని గంటల ముందు ఆమె రంగు తలపాగాతో ఉన్న తన వీడియోలు, చిత్రాలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.