Sonia Joins Bharat Jodo Yatra: కొడుకుతో కలిసి పాదయాత్రలో కదంతొక్కిన సోనియా, భారత్ జోడో యాత్రలో జాయిన్ అయిన కాంగ్రెస్ అధినేత్రి, కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం, రేపు రాహుల్‌కు మద్దతుగా భారత్ జోడో యాత్రకు ప్రియాంక వాద్రా
రాహుల్‌తో కలిసి పాదయాత్ర (Sonia Gandhi Joins) చేశారు. సోనియాతో పాటూ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కూడా పాదయాత్రలో పాల్గొన్నారు
Karnataka, OCT 06: బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) చేపట్టిన భారత్ జోడోయాత్ర (Bharat Jodo Yatra) గురువారం తిరిగి కర్ణాటకలో ప్రారంభమైంది. విజయదశమి సందర్భంగా మంగళ, బుధవారాల్లో పాదయాత్రకు రాహుల్ (Rahul) విరామం ఇచ్చారు. ఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్ర (Sonia Gandhi Joins) చేశారు. సోనియాతో పాటూ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4:30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమై 7గంటలకు బ్రహ్మదేవరహల్లి గ్రామం వద్ద సభలో రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి నాగమంగళ తాలూకా ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఎదురుగా మడకే హోసూర్ గేట్ వద్ద రాహుల్, ఆయన బృందం బస చేస్తారు.
భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సోనియాగాంధీ సోమవారమే కర్ణాటకకు (Karnataka) చేరుకున్నారు. రెండు రోజులు కొడుగు జిల్లాలోని ఓ రిసార్ట్‌లో బసచేశారు. వచ్చే సంవత్సరం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పాదయాత్ర కీలకంగా మారింది. సెప్టెంబర్ 30న కేరళ నుండి యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించి నాటి నుంచి రాహుల్ గాంధీ బీజేపీ (BJP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైపై రాహుల్ విమర్శలు చేస్తున్నారు.
సోనియాగాంధీ యాత్రలో పాల్గోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత రెట్టింపయిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. రేపు భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గోనున్నారు. పాదయాత్ర లో వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. తమిళనాడు, కేరళ అనంతరం కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించిన యాత్ర నేటికి 29వ రోజుకు చేరింది. ప్రతిరోజూ 25 కి.మీ. మేర రాహుల్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజుల్లో 3,500 కి.మీ మేర 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనున్న విషయం తెలిసిందే.