Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, పలు చోట్ల పొంగిపొర్లిన వాగులు, మరో 24 గంటల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ శాఖ

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపనాలు (Southwest Monsoon) ఒక్కరోజులోనే రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రుతుపవనాలకుతోడు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. అల్పపీడనం, రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది.

Heavy Rains To Hit Telugu States in Next 2 Days (Photo-Twitter)

Hyderabad, June 12: నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపనాలు (Southwest Monsoon) ఒక్కరోజులోనే రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రుతుపవనాలకుతోడు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. అల్పపీడనం, రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది.

తెలంగాణలో కొత్తగా మరో 209 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4,320కి చేరిన కరోనా బాధితుల సంఖ్య, 165కు పెరిగిన కోవిడ్ మరణాలు

నైరుతి రుతుపవనాల (Southwest Monsoon 2020) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని టేకుమట్ల మండలం కలికోటపల్లి..పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్ గ్రామాల మధ్యలోని మానేరు వాగు ఉధృతికి టాటా ఏస్ వాహనం వరదలో చిక్కుకున్నది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.

గురువారం గ్రేటర్‌లోని హఫీజ్‌పేట, మియాపూర్‌, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.0 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల వారు ఈసారి నిశ్చింతగా ఉండవచ్చని బల్దియా భరోసా ఇస్తున్నది. వరద కారణంగా ఏర్పడే ముంపు నుంచి వెంటనే తేరుకునే విధంగా సర్కిల్‌, జోనల్‌ స్థాయిలో సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసింది. అంతేకాదు, చెట్లు కూలడం, తదితర విపత్తులు సంభవించడం వంటి ఘటనలు జరిగిన వెంటనే వేగంగా సహాయక చర్యలు చేపట్టనున్నది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేందుకు సిబ్బందిని సిద్ధం చేసింది.

తెలంగాణతో పాటుగా మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలోని మొత్తం ప్రాంతాలు, కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో మొత్తం ప్రాంతాలు, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు, అసోం, మేఘాలయలోని మరి కొన్ని ప్రాంతాల్లోకి ఇవి విస్తరించాయి.

మధ్య అరే బియా సముద్రంతో పాటు మహారాష్ట్రలో మరి కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం లోని మొత్తం ప్రాంతాలు, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతా ల్లోకి 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించింది.

ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడం, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగానూ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) (India Meteorology Department) తెలిపింది. గురువారం దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే 36 గంటల్లో తెలంగాణకు నైరుతి విస్తరిస్తుందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. డాక్టర్ సుధాకర్ పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మండిపడిన విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీగా వర్షం పడింది. నంద్యాలలో అత్యధికంగా 98.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒకే రోజు జిల్లా మొత్తం మీద 25.2 మి.మీ. వర్షపాతం నమోదు కావడం విశేషం. పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపించాయి. ప్రకాశం జిల్లాలో బుధ, గురువారాల్లో జోరు వాన కురిసింది. ఆగస్టు నుంచి గ్రామాల్లోకి వైయస్ జగన్, ఎవరైనా పథకాలు అందలేదని ఫిర్యాదులు చేస్తే అధికారులే బాధ్యులు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం

గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కుండపోత వర్షం కురిసింది. గిద్దలూరు ప్రాంతంలోని ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ఉధృతికి గుంటూరు–దొనకొండ రైల్వే ట్రాక్‌ కింద భాగం మొత్తం కొట్టుకొని పోయింది.

Here's Video

సగిలేరు పొంగి పొర్లుతోంది. 15 చెరువులు నిండుకుండల్లా మారాయి. వర్షానికి పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సగటున 2.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now