Mauritius: రామ‌య్య ప్రాణ‌ప్ర‌తిష్ట పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకునేందుకు హిందువుల‌కు సెల‌వు, హాలిడే ఇచ్చింది భార‌త్ కాదు.. ఏ దేశ‌మంటే?

ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును (Holiday In Mauritius) మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది.

Ram Mandir (File Image)

New Delhi, JAN 13: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం (Ram Temple Inauguration) ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును (Holiday In Mauritius) మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని (Mauritius) హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనున్నది. ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనున్నది. మారిషస్ (Mauritius) జనాభాలో 48.5శాతం హిందువులు ఉన్నారు. సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఇదో చిన్న ప్రయత్నమని మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్నాథ్ పేర్కొన్నారు.

PM Modi Cleaning Temple Video: వీడియో ఇదిగో, స్వీపర్ అవతారం ఎత్తిన ప్రధాని మోదీ, కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేసిన ప్రధాని 

భారత్‌లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయడానికి మంత్రివర్గం అంగీకరించినట్లు ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన అయోధ్య రాముడి గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని రంగాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. 50కి పైగా దేశాలకు చెందిన ప్రముఖులు కూడా దీక్షా కార్యక్రమానికి హాజరుకానున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif