Spice Jet Furloughs: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్.. సిబ్బందికి మూడు నెలలు జీతం కట్
చౌకధరలకే విమాన ప్రయాణాన్ని అందించే దేశీయ విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న స్పైస్ జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
Newdelhi, Aug 30: చౌకధరలకే విమాన ప్రయాణాన్ని అందించే దేశీయ విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న స్పైస్ జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని (Spice Jet Furloughs) సంస్థ నిర్ణయించింది. నిధుల లేమి కారణంగా 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు సెలవులపై పంపించనుంది. ఈ కాలంలో వారికి మూడు నెలల పాటు వేతనాలు చెల్లించేదిలేదని తెలిపింది.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతారా ? రేవంత్ రెడ్డిపై మండిపడిన సుప్రీంకోర్టు
Here' s Video Info:
అందుకే ఈ నిర్ణయం
ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే విమాన సర్వీసులను తగ్గించుకున్నస్పైస్ జెట్.. తాజాగా సిబ్బందిని సెలవులపై పంపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ తాజా నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా, సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.