Private Jet Crashes Into Business Jet at Scottsdale Airport

అమెరికాలో అరిజోనా రాష్ట్రంలోని స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్ట్ లో విమాన ప్రమాదం (US Jets Collision) చోటుచేసుకుంది. రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పింది. పార్కింగ్ ప్లేసులో ఉన్న మరో ప్రైవేట్ జెట్ ను (Plane Crash at Scottsdale Airport) ఢీ కొట్టింది. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం.. లియర్‌జెట్ 35ఏ విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది.

దక్షిణ మెక్సికోలో ఘోరం.. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం, వీడియో ఇదిగో

రన్‌వే దాటి ర్యాంప్‌పై ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అధికారులు స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేను క్లియర్ చేసి, విమానాల రాకపోకలకు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. గడిచిన రెండు వారాల్లో అమెరికాలో నాలుగు ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో 67 మంది చనిపోయారు.

Plane Crash at Scottsdale Airport:

రెండు రోజుల తర్వాత (జనవరి 31న) ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఫిబ్రవరి 9న అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని పదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ప్రమాదంతో గత రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరగగా మొత్తం 85 మంది చనిపోయారు.