దక్షిణ మెక్సికోలో ఘోరం జరిగింది(Tragedy in Southern Mexico). బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం అయ్యారు(40 people burned alive). ఇక ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా(40 people burned alive) టబాస్కో రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మంటలు విస్తరించడంతో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కొల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఇక కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌ కు ఉత్తరాన రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 7.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ఈ భూకంపానికి సంబంధించి సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని స్పష్టంగా పేర్కొంది.

Tragedy in southern Mexico: 40 people burned alive after bus catches fire

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)