Earthquake (Photo Credits: X/@Top_Disaster)

Newdelhi, Feb 9: కరేబియన్‌ సముద్రంలో (Caribbean Sea) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. హోండురస్‌ కు ఉత్తరాన రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 7.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ఈ భూకంపానికి సంబంధించి సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని స్పష్టంగా పేర్కొంది. క్యూబా తీరప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 1-3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.

అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??

ఈ దేశాలపై ప్రభావం..

తాజా భూకంప ప్రభావం పలు దేశాలపై పడింది. జమైకా, మెక్సికో, టర్క్స్, కైకోస్, శాన్ ఆండ్రెస్ ప్రావిడెన్స్, డొమినిక్ రిపబ్లిక్, కొలంబియా, పనామా, కేమన్ ఐలండ్స్, కోస్టారికా, హోండూరస్, అరుబా, నికరగ్వా, క్యూబా, బొనైర్‌పై తీవ్రంగా పడింది. ఆయా దేశాల తీర ప్రాంతాలన్నీ పోటెత్తాయి. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా స్థానిక అధికారులు ఖాళీ చేయించారు.

ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే?