SpiceJet Emergency landing: స్పైస్ జెట్ విమానంలో మంటలు, పాట్నా ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇంజిన్ ను ఢీకొట్టిన పక్షి, పైలెట్ సమయస్పూర్తితో దక్కిన 185 మంది ప్రాణాలు
గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (emergency landing) చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్‌జెట్ (Spice Jet) ఎయిర్‌క్రాఫ్ట్ వెల్లడించింది.
Patna, June 20: పాట్నాలో స్పైస్ జెట్ (Spice Jet) విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (emergency landing) చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్‌జెట్ (Spice Jet) ఎయిర్‌క్రాఫ్ట్ వెల్లడించింది. “ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ప్రయాణిస్తున్నప్పుడే మంటలు అంటుకున్నట్లు తెలిసి.. వెంటనే ల్యాండ్ చేశాం. రెండు బ్లేడ్లు వంగిపోయాయి. పుల్వారీ షరీఫ్ మంటలను గమనించి ఎయిర్‌పోర్ట్ (Airport)అధికారులకు సమాచారం ఇచ్చారు” అని పట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ అన్నారు. ప్రయాణికులెవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ కేమంగా ఉన్నారు.
స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఆదివారం 185 మంది ప్రయాణికులతో పాట్నా ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే విమానం ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు రప్పించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 185 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పాట్నా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.
కాగా, ఈ సంఘటనపై స్పైస్‌జెట్ కూడా వివరణ ఇచ్చింది. విమానం టేకాఫ్ కాగానే ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌ను ఒక పక్షి ఢీకొట్టిందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ ఇంజిన్‌లో మంటలు (Fire in Engine) రావడాన్ని గమనించిన కేబిన్ సిబ్బంది వెంటనే పైలట్లను అలెర్ట్ చేసినట్లు చెప్పారు.
పైలట్లు వెంటనే ఆ ఇంజిన్‌ను ఆపి వేశారని, అనంతరం విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత మరో స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణికులను ఢిల్లీకి చేర్చినట్లు వివరించారు. విమానం ఇంజిన్‌లో మంటలు రావడానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు స్పైస్‌జెట్ విమానం రెక్క వద్ద ఇంజిన్ నుంచి మంటలు, పొగలను గమనించిన పాట్నా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని కొందరు స్థానికులు తమ మొబైల్‌లో రికార్డు చేసిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.