Man Stuck In Loo For Entire Flight: విమానం గాల్లో ఉండగా బాత్రూంలో చిక్కుకుపోయిన ప్రయాణికుడు, 2 గంటల పాటూ టాయిలెట్ లోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన వ్యక్తి, చివరకు డోర్ బద్దలుకొట్టి కాపాడిన సిబ్బంది
అతను టాయిలెట్ లో ఉండగా డోర్ లాక్ అయింది. దీంతో దాదాపు రెండు గంటల పాటూ అతను బాత్రూంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు కెంపెగౌడ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీర్లు బాత్రూం డోర్ ను పగులగొట్టి అతన్ని బయటకు తీసుకువచ్చారు
Bangalore, JAN 17: ముంబై నుంచి బెంగళూరు (Mumbai-Bengaluru Flight) వెళ్తున్న స్పైస్ జెట్ (SpiceJet) విమానంలో ఓ ప్రయాణికుడికి అత్యంత చేదు ఘటన ఎదురైంది. విమానం ల్యాండింగ్ అవ్వడానికి ముందు టాయిలెట్ కు వెళ్లిన ప్రయాణికుడు...అందులోనే (Stuck in Aircraft Toilet ) చిక్కుకుపోయాడు. అతను టాయిలెట్ లో ఉండగా డోర్ లాక్ అయింది. దీంతో దాదాపు రెండు గంటల పాటూ అతను బాత్రూంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు కెంపెగౌడ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీర్లు బాత్రూం డోర్ ను పగులగొట్టి అతన్ని బయటకు తీసుకువచ్చారు.
మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ముంబై నుంచి బెంగళూరు వచ్చిన ప్రయాణికుడి పూర్తి వివరాలను స్పైస్ జెట్ వెల్లడించలేదు.