Startup Mahakumbh: దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లతో 12 లక్షల మంది యువతకు ఉపాధి, స్టార్టప్ మహాకుంభ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలోని స్టార్టప్‌లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు.

PM Narendra Modi (Photo Credit: X/@narendramodi)

New Delhi, Mar 20: ఢిల్లీ(delhi)లోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన స్టార్టప్ మహాకుంభ్‌(startup Mahakumbh Event 2024) కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని తెలిపారు. దేశంలోని స్టార్టప్‌లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు.

ఈ క్రమంలో వ్యవసాయం, జౌళి, వైద్యం, రవాణా, అంతరిక్షం, యోగా, ఆయుర్వేదం వంటి రంగాల్లో స్టార్టప్‌లు మొదలైనందుకు సంతోషిస్తున్నట్లు మోదీ తెలిపారు. రాజకీయాల్లో కూడా కొంతమంది స్టార్టప్‌లు(startups) ప్రారంభిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు.అందులో విజయవంతం సాధించలేకపోతే, వెంటనే మరొకదానికి వెళ్లాలని సూచించారు. భారతీయ స్టార్టప్‌లు 50కి పైగా అంతరిక్ష రంగాలలో పని చేస్తున్నాయని చెప్పారు. స్పేస్ సెక్టార్ ఇటీవల ప్రైవేట్ ప్లేయర్‌లకు తెరవబడింది. భారతదేశం నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అని తెలిపారు.  బీజేపీ ప్రభంజనంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయి, జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఫైర్

స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమం మార్చి 18-20 వరకు న్యూఢిల్లీ(delhi)లోని భారత్ మండపం(Bharat Mandapam)లో జరుగుతోంది. ఈ ఈవెంట్‌ను అపెక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్, బూట్‌స్ట్రాప్ ఇంక్యుబేషన్ అండ్ అడ్వైజరీ ఫౌండేషన్, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (IVCA) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

Here's Videos

స్టార్టప్ మహాకుంభ్ అనేది దేశంలో అతిపెద్ద మొదటి స్టార్టప్ కార్యక్రమం.ఈ కార్యక్రమం థీమ్ భారత్ ఇన్నోవేట్స్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం దేశం రోడ్‌మ్యాప్‌పై పని చేస్తున్నప్పుడు, ఈ స్టార్టప్ మహాకుంబ్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని ప్రధాని నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో 2000 స్టార్టప్‌లు, 1000+ పెట్టుబడిదారులు, 100+ యునికార్న్‌లు, 300+ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్‌లు ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా 3,000 మంది ప్రతినిధులు, 10 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు, 3000 మందికి పైగా కాబోయే వ్యవస్థాపకులు సహా పలువురు హాజరయ్యారు.