Jamia Violence CCTV Footage: జామియా దాడి వీడియోలు లీక్, పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తున్నట్లుగా వీడియో, క్రైమ్ బ్రాంచ్‌కు ట్రాన్సఫర్ అయిన జామియా కేసు

డిసెంబర్ 15న జామియా మిలియా యూనివర్సిటీ (Jamia Millia Islamia University) విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి కీలక వీడియోను విద్యార్థి సంఘం నాయకులు శనివారం విడుదల చేశారు.49 సెకండ్లున్న తాజా వీడియో ప్రకారం.. యూనివర్సీటీలోని పాత రీడింగ్‌ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థుల్ని పోలీసులు లాఠీలతో చితకబాదారు.

Screengrab of CCTV footage released by Jamia Coordination Committee (Photo Credits: Twitter)

New Delhi, February 16: జామియా మిలియా ఇస్లామియా (Jamia Millia Islamia) స్టూడెంట్స్‌పై పోలీసులు దాడి చేస్తున్నట్లుగా వీడియో లీకయింది. డిసెంబర్ 15న జామియా మిలియా యూనివర్సిటీ (Jamia Millia Islamia University) విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి కీలక వీడియోను విద్యార్థి సంఘం నాయకులు శనివారం విడుదల చేశారు.49 సెకండ్లున్న తాజా వీడియో ప్రకారం.. యూనివర్సీటీలోని పాత రీడింగ్‌ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థుల్ని పోలీసులు లాఠీలతో చితకబాదారు.

పౌరసత్వ సవరణ చట్టానికి (Anti-CAA Protests) వ్యతిరేకంగా గళం విప్పిన యూనివర్సీటీ విద్యార్థులపై రెండు నెలల క్రితం పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన వీడియో ప్రకారం ఢిల్లీ పోలీసులు హాల్‌లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ వీడియోనే విడుదల చేసిన జేసీసీ స్టూడెంట్స్‌ను కొట్టడమే కాకుండా ప్రొపర్టీని కూడా ధ్వంసం చేశారు. చదువుకునే వాళ్లు అక్కడి నుంచి వెళ్లేంత వరకూ దాడి చేశారు. 'సీసీటీవీ ఫుటేజి (Jamia Violence CCTV Footage) పోలీసుల అకృత్యాన్ని బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తయారుచేస్తున్న టెర్రరిస్టులు వీళ్లు. పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌పై ఎలా దాడి చేశారో చూడండి' అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.

ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసు ఆల్రెడీ క్రైమ్ బ్రాంచ్‌కు ట్రాన్సఫర్ అయింది. వీడియో సాక్ష్యం ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు. డిసెంబరు 15న జామియా యూనివర్సిటీ అల్లర్లతో పోలీసులపై రాళ్లు విసురుకుంటూ, పబ్లిక్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేసుకుంటూ యుద్ధ వాతావరణం నెలకొంది.

More Among Twitterati Question the Use of Handkerchief

క్యాంపస్‌ మైదానంలో సీఏఏకు నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను డిసెంబర్ 15న లాఠీ లార్జీ, టియర్‌ గ్యాస్‌తో పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడిలో విద్యార్థి నాయకులురాలు ఆయిషీ ఘోష్‌ తలకు గాయమైంది. ఈ ఘటనలో దాదాపు 100 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విద్యార్థుల భారీ ర్యాలీ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు చర్యలు మాత్రమే చేపట్టామని, ఎవరిపై దాడులు చేయలేదని పోలీసులు పేర్కొనడం తెలిసిందే.

See Priyanka Gandhi's Tweet

ఈ వీడియోను కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ పోస్టు చేస్తూ.. తన అభిప్రాయం వెల్లడించారు. 'ఢిల్లీ పోలీసులు విచక్షణ లేకుండా చదువుకుంటున్న విద్యార్థులపై ఎలా దాడి చేశారో చూడండి. ఓ స్టూడెంట్ పుస్తకాన్ని చూపిస్తుంటే అతణ్ని లాఠీతో కొడుతున్నాడు పోలీస్. హోం మంత్రి, ఢిల్లీ పోలీసులు లైబ్రరీలోకి వెళ్లి ఎవ్వరినీ గాయపరచలేదని అబద్ధం చెప్తున్నార' ని కామెంట్ చేశారు.

ఈ వీడియో చూశాక కూడా ప్రభుత్వం జామియా ఆందోళనలపై ఏ యాక్షన్ తీసుకోలేదంటే వారి ఉద్దేశ్యం ఏంటో దేశమంతా స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం ఘటనపై తన గొంతు కలిపారు. 'జామియా విద్యార్థులు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోయినా పోలీసులు దాడి చేశారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ పోలీసులపై చర్యలు తీసుకోవాలి' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.