Chhattisgarh Naxal Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌, 17 మంది జవాన్లు మృతి, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు

భద్రతా దళాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. అక్కడ భద్రతా దళాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా లో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Sukma Naxal Encounter) 17 మంది పోలీసులు మృతిచెందారు.

Representational Image (Photo Credits: PTI)

Raipur, Mar 22: దేశమంతా జనతా కర్ఫ్యూలో ఉన్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రతా దళాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. అక్కడ భద్రతా దళాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా లో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Sukma Naxal Encounter) 17 మంది జవాన్లు మృతిచెందారు.

ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు

ఎన్‌కౌంటర్‌ జరిగిన సుక్మాలోని మింపా అడవుల్లో 17 మంది పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ (encounter) తర్వాత డజను మందికి పైగా పోలీసులు మిస్‌ అయ్యారనీ... గాయపడిన మరో 14 మంది జవాన్లను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చత్తీస్‌గఢ్ పోలీసులు నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.

సుక్మా జిల్లాలోని చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అనంతరం 17 మంది పోలీసులు కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాయి. ఆదివారం రోజున అడవుల్లో పోలీసుల మృతదేహాలను గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.

కాగా, శనివారం రోజున స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్ట్స్‌కు ప్రత్యేక బలగాలు కుంబింగ్‌ చేపట్టాయి. అయితే బలగాలు మిన్పా గ్రామానికి చేరుకున్న సమయంలో.. అక్కడ భారీగా మోహరించిన నక్సల్స్‌ ఎదుకాల్పులకు దిగాయి. దాదాపు రెండున్నర గంటల పాటు ఇరువర్గాల మధ్య భీకర పోరు సాగింది. ఈ కాల్పుల్లో 15 మంది భద్రత సిబ్బంది గాయపడగా, 17 మంది కనిపించకుండా పోయారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు జరుపుతున్న సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తి తెలిపారు.