New Delhi, March 22: కరోనావైరస్ కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం (Central govt) తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైలు సర్వీసులు (All Passenger Trains Cancelled) నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే గూడ్స్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని కేంద్రం వెల్లడించింది.
కరోనా మృత్యు ఘోష, తాజాగా బీహార్‌లో కరోనాతో వ్యక్తి మృతి
దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకు 340కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి భారీన పడి ఆరుగురు చనిపోయారు. వైరస్ ని అరికట్టేందుకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు.
ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 14 గంటల పాటు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రధాని మోడీ పిలుపుతో యావత్ దేశం కర్ఫ్యూని పాటిస్తూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇండియాలో మరొక కరోనా పేషెంట్ మృతి
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం(మార్చి 22,2020) ఒక్కరోజే మహారాష్ట్రలో 10 (ముంబైలో 6, పుణెలో 4) కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 74కి పెరిగింది. కాగా వీరిలో కొందరు ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. విదేశాలకు వెళ్లకపోయినా కరోనా వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది.
దేశ వ్యాప్తంగా నిలిచిపోనున్న 3700 రైళ్లు
మొదటగా కర్నాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఆ తర్వాత ఢిల్లీలో ఒకరు కరోనాతో చనిపోయారు. మార్చి 17న ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 64ఏళ్ల వృద్ధుడు కరోనా మరణించాడు. ఆ తర్వాత పంజాబ్ లో 79ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. తాజాగా ఆదివారం మహారాష్ట్రలో(ముంబై) ఒకరు, పాట్నాలో 6వ కరోనా మరణం చోటు చేసుకుంది.