CM KCR on Janata Curfew: తెలంగాణాలో 24 గంటలు బంద్, ప్రధాని మీద ట్రోల్ చేస్తే చర్యలు తప్పవు, ఆదివారం 5 గంటలకు చప్పట్లతో ఐక్యతను చాటిచెబుదాం, మీడియాతో సీఎం కేసీఆర్
Telangana CM KCR Press Meet on Janata Curfew | File Image of Telangana CM KCR | File Photo

Hyderabad, Mar 21: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో (Janata Curfew) స్వచ్ఛందంగా పాల్గొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ( K Chandrashekar Rao) ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కర్ఫ్యూను ఎవరికివారు విధిగా పాటిద్దామని సూచించారు.

కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

క్వారం‌టైన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు.

అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇండియాలో 271కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రెండురోజుల తర్వాత మహారాష్ట్ర బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తున్నాం. కరోనా వైరస్‌పై (CM KCR on coronavirus) ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టాం. మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చారు. ట్రేస్‌నుంచి 11వేలమందిని ఆధీనంలోకి తీసుకున్నాం. 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయి. 700 మందికి పైగా అనుమానితులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారందరూ విదేశాలనుంచి వచ్చిన వారేనని తెలిపారు.

కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ’ (సీసీఎంబీ)ని ప్రయోగశాలగా ఉపయోగించాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ సూచించారు. పెద్దసంఖ్యలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిచేందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 627 మంది కరోనాకు బలి

కేంద్రం ఆధ్వర్యంలోని సీసీఎంబీలో జీవసంబంధ పరిశోధనలు జరుగుతున్నాయని.. కరోనా వైరస్‌ నిర్ధారణకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కేంద్రంతో కలిసి సమిష్టిగా కట్టడిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాగా కరోనా కట్టడికి ‘జనతా కర్ఫ్యూ’ (PM Modi Janata Curfew) పేరుతో పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్‌ పంపే యోచన చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి టెస్టింగ్‌ పరికరాలు, మాస్క్‌లు వచ్చాయని చెప్పారు. సమస్య తీవ్రమైతే మనం ముందుగా వైద్యుల్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. మోదీ సందేశాన్ని కూడా సోషల్‌ మీడియాలో వక్రీకరిస్తున్నారన్నారు. కొందరు వక్రబుద్ధితో ప్రధానిని కూడా అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్‌ చేయాలని డీజీపీకి చెప్పినట్లు పేర్కొన్నారు.

కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్న ఎంపీలు

రేపు సాయంత్రం 5 గంటలకు నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వచ్చి చప్పట్లు కొడతాను. చప్పట్లు కొట్టి మన ఐక్యతను చాటి చెప్పాలి. రేపు సాయంత్రం 5 గంటలకు సైరన్‌ మోగిస్తాం. సైరన్‌ మోగగానే బయటికి వచ్చి 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలి’ అని తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ పిలుపునిచ్చారు.