New Delhi, Mar 22: ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ (COVID-19) రాజ్యమేలుతోంది. దీని వల్ల వేల మంది మరణించగా.. లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. దీంతో దీన్ని నివారించేందుకు ప్రధాని మోదీ (PM Modi) దేశవ్యాప్తంగా నేడు జనతా కర్ఫ్యూ (PM Modi Janata Curfew) పాటించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూకి (Janata Curfew) సిద్ధమయ్యారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తమ వంతుగా ముందుకు వచ్చి కరోనాని ఇండియా నుంచి తరిమికొట్టేందుకు రెడీ అయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్,సినిమా హాళ్లు అన్నీ మూసుకుపోయాయి. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చేసుకుంటున్నారు. రైళ్లు , బస్సులు అన్ని 24 గంటల పాటు బంద్ అయ్యాయి.
నేడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సామాజిక బాధ్యతగా జనతా కర్ఫ్యూ విధించుకున్నారు. పలు రాష్ట్రాల్లో అన్నీ రవాణా సదుపాయాలు మూతపడ్డాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు తీసే పరిస్థితి కనపడటం లేదు. ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ నగరాలు సహా మెట్రోరైల్ సర్వీసులను ఆదివారం నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. ఎవరూ బయటకు రాకుండా ఉండాలన్నారు. ప్రయాణాలు కూడా ప్రజలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రధాని మోడీ మాటల్లో..
''మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ప్రజా కర్ఫ్యూను అమలు చేయాలి. ఆ రోజంతా మీరు మీ ఇళ్లలోనే ఉండండి. అవసరమైన పనులు ఉన్నవాళ్లు మాత్రమే బయటకు వెళ్లాలి. వారికి బాధ్యత ఉంటుంది. కానీ పౌరులుగా.. ఎవరినీ చూడ్డానికి కూడా వెళ్లకండి. సంకల్పం తీసుకోండి.
కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం
దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు చేయాలని కోరుతున్నా. ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాటించే ఈ ప్రజా కర్ఫ్యూ సందేశాన్ని ప్రజల వరకూ చేర్చాలి. వారిని చైతన్యం చేయాలి. పది మంది కొత్తవారికి ఫోన్ చేసి దీని గురించి చెప్పాలి. కరోనావైరస్ లాంటి విశ్వమహమ్మారి మీద యుద్ధం కోసం భారత్ ఎంత సిద్ధగా ఉందో చూపాల్సిన సమయం ఇది.’’