Representational image, Indian Railways | Photo Credits : Wiki Commons

New Delhi, Mar 21: ప్రధాని మోదీ రేపు జనతా కర్ఫ్యూకి (PM Modi Janata Curfew) పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు దేశ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోనున్నాయి.

ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కాగా హైదరాబాద్‌లో (Hyderabad) ఎంఎంటీఎస్‌ రైళ్లు (MMTS Trains) రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణం ప్రారంభించిన దూరప్రాంత రైళ్లు (Trains) మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి.

ఉదయం 7 నుంచి రాత్రి 9 మధ్య ప్రారంభమయ్యే మిగతా అన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. నగరంలో తిరిగే 121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో రెండు, మూడు మినహా మిగతావాటిని నిలిపేస్తున్నారు.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం

అలాగే హైదరాబాద్‌లోనూ రేపు మెట్రో రైలు సర్వీసులు (Metro Rail Service) నిలిచిపోన్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్న ఎంపీలు

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ ప్రమాదం పొంచి ఉన్నా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా రైళ్లు నడుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్‌ కార్యాలయాలు, సాధారణ బుకింగ్‌ కేంద్రాలు, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌ల వద్ద, పార్శిల్‌ కార్యాలయాల వద్ద ఒకరికి ఒకరికి మధ్య మీటర్‌ దూరం ఉండేలా ఫ్లోర్‌పై మార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

రైల్వే స్టేషన్లలో ఉన్న రిటైరింగ్‌ రూమ్స్, డార్మిటరీలను మూసేయాలని రైల్వే నిర్ణయించింది. శనివారం రాత్రి 12 నుంచి ఏప్రిల్‌ 15 రాత్రి 12 వరకు వీటిని మూసి ఉంచాలని నిర్ణయించింది.