Viveka Murder Case Update: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.., హంతకులు దొరికారంటూ సోషల్ మీడియాలో వార్తలు, అవి నిజం కాదని ఖండించిన పోలీసులు,ఫేక్ ప్రచారం చేస్తే జైలుకే అంటూ హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

Y. S. Vivekananda Reddy (Photo-PTI)

Kadapa,October 13:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ విషయాలు వెలుగుచూశాయని ఆ వార్తల సారాంశంగా తెలుస్తోంది.

కాగా వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో అనుమానాలు పెరిగాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ వార్తలను నమ్మవద్దని పోలీసులు తెలిపారు. సుఫారీ గ్యాంగ్ ఉన్నట్లుగా మేము ఎక్కడా చెప్పలేదని తేల్చి చెప్పారు.  ఈ రకమైన ప్రచారం చేస్తే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

కాగా ఈ ఏడాది మార్చిలో పులివెందులో తన నివాసంలో వివేకా హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని భావించినప్పటికీ ఒంటిపై ఉన్న గాయాలు, పోస్ట్ మార్టం నివేదికలో ఆయనది హత్య అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. దీని పైన రాజకీయంగా అనేక ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఈ హత్య కేసు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా డీజీపీని ఆదేశించారు. దీంతో..ఆయన స్వయంగా పులివెందులకు వెళ్లి సిట్ అధికారులతో సమావేశమయ్యారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్‌ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif