IPL Auction 2025 Live

Delhi Excise Policy Scam Case: మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Supreme Court of India (File Photo)

New Delhi, Oct 30: అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.338 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. సిసోడియా గడిచిన ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నారు.

కేరళలో వరుస బాంబు పేలుళ్లు..2500 మంది హాజరైన సమావేశంలో పేలిన బాంబు..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకల కింద ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును కింది కోర్టులు కొట్టేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది.



సంబంధిత వార్తలు

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్

Rishabh Pant: రూ. 27 కోట్లతో ఐపీఎల్ వేలం రికార్డులన్నీ బద్దలు కొట్టిన రిషబ్ పంత్, IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ వికెట్ కీపర్

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి