SC Dismisses Plea for Ballot Paper: పేప‌ర్ బ్యాలెట్‌తో ఎన్నిక‌లు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

సుప్రీంకోర్టులో పిల్ వేసిన సంగతి విదితమే. నేడు జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, పీబీ వ‌రాలేతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. విచారణ తర్వాత ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court Criminal cases should not be slapped against journalistX)

New Delhi, Nov 26: పేప‌ర్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతూ కేఏ పాల్ .. సుప్రీంకోర్టులో పిల్ వేసిన సంగతి విదితమే. నేడు జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, పీబీ వ‌రాలేతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. విచారణ తర్వాత ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో గెలిస్తే, ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంప‌ర్ కాలేదంటున్నార‌ని, ఒక‌వేళ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందితే, అప్పుడు ఈవీఎంలు ట్యాంప‌ర్ అయిన‌ట్లు చెబుతున్నార‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.ఇక ఈ పిటిషన్‌తో పాటు మ‌ద్యం, డ‌బ్బులు పంపిణీ చేసే అభ్య‌ర్థిని ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా అయిదేళ్ల పాటు బ‌హిష్క‌రించేలా ఈసీ నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని చేసిన అభ్య‌ర్థ‌న‌ను కూడా కోర్టు కొట్టిపారేసింది.

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!

కేఏ పాల్ పిటిషన్ విచారణలో ధర్మాసనం.. మీరు వేసిన పిల్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని, ఇలాంటి అద్భుత‌మైన ఐడియాలు ఎలా వ‌స్తాయ‌ని కోర్టు అడిగింది. అయితే సుమారు మూడు ల‌క్ష‌ల మంది అనాథ‌లు, 40 ల‌క్ష‌ల మంది వితంతువుల‌ను ర‌క్షించింన సంస్థ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నానని పిటీష‌న‌ర్ తెలిపారు. ఆ స‌మ‌యంలో కోర్టు స్పందిస్తూ.. రాజ‌కీయ రంగంలోకి ఎందుకు ప్ర‌వేశిస్తున్నార‌ని, మీకు అనుభ‌వం ఉన్న రంగం వేరు కాదా అని కోర్టు అడిగింది.

దానికి పాల్ 150 దేశాల్లో తాను తిరిగాన‌ని చెప్పారు. దానికి కోర్టు స్పందిస్తూ ఆయా దేశాల్లో పేప‌ర్ బ్యాలెట్ ఉందా లేక ఈవీఎంలు ఉన్నాయా అని అడిగింది. విదేశాలు ఎక్కువ శాతం పేప‌ర్ బ్యాలెట్‌కు మొగ్గుచూపిన‌ట్లు పిటీష‌న‌ర్ చెప్పారు. భార‌త్ కూడా పేప‌ర్ బ్యాలెట్‌ను తిరిగి అమ‌లు చేయాల‌న్నారు. దీనిపై ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ప్ర‌పంచ దేశాల‌కు విరుద్ధంగా మ‌నం ఎందుకు ఉండ‌కూడద‌ని ప్ర‌శ్నించింది.