Smoking Age: పొగ తాగే వారి వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, ప్రచారం కోరుకుంటే మంచి కేసు వాదించాలని పిటిసనర్‌కు చురక
ఈ సందర్భంగా పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును (Smoking age) 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీంకోర్టు (supreme court) బుధవారంనాడు నిరాకరించింది. లూజ్ సిగరెట్లపై నిషేధానికి విముఖత వ్యక్తం చేసింది.
New Delhi, July 22: ధూమపానాన్ని అదుపు చేసేందుకు నియమనిబంధనలు విధించాలని కోరుతూ న్యాయవాదులు సుభా అవస్థి, సప్త రిషి మిక్రా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై (పిల్) అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును (Smoking age) 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీంకోర్టు (supreme court) బుధవారంనాడు నిరాకరించింది. లూజ్ సిగరెట్లపై నిషేధానికి విముఖత వ్యక్తం చేసింది. ఇద్దరు అడ్వకేట్లు వేసిన ఈ పిటిషన్లను ఎస్‌కే కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. షాకింగ్ న్యూస్.. భారత్ వద్దని పౌరసత్వాన్ని వదులుకున్న 1.6 లక్షల మంది ప్రవాస భారతీయులు, గత ఐదేళ్లలో ఇదే అత్యధికం, వివరాలను వెల్లడించిన MHA
మీరు ప్రచారం కోరుకుంటే మంచి కేసు వాదించండి. అంతేకానీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయకండి'' అని కోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది. కాగా వాణిజ్య ప్రాంతాల వద్ద స్మోకింగ్ జోన్‌లను తొలగించాలని, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, ఆరాధానా స్థలాల వద్ద లూజ్ సిగరెట్ సేల్స్‌ను నిషేధిస్తూ ఆదేశాలివ్వాలని పిటిషనర్లు తమ పిల్‌లో కోర్టును కోరారు.