Vijay Mallya Case: విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, ముంబై కోర్టు తీర్పును సమర్థిస్తూ మాల్యా పిటిషన్ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది.తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ మాల్యా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది

Vijay Mallya (Photo Credit: Wikimedia Commons)

New Delhi, Mar 3: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది.తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ మాల్యా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.ఈ విషయంలో పిటిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు అందడం లేదని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది.

తనను పరారీలో ఉన్నఆర్థిక నేరగాడిగా ప్రకటించి, తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ మాల్యా సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం నాన్ ప్రాసిక్యూషన్ కారణంగా పిటిషన్ కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

ప్రయాణికులకు అలర్ట్, 240 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే, రద్దయిన రైళ్ల పూర్తి సమాచారం ఇదిగో, జాబితాలో మీ రైలు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 9 వేల కోట్లకు పైగా ఎగవేసిన మాల్యా 2016లో లండన్‌కు పరార్ అయ్యాడు. దీనిపై సీబీఐ , ఈడీ కేసులు నమోదు చేశాయి. జనవరి 5, 2019న ముంబై కోర్టు చట్టం ప్రకారం మాల్యాను ‘పరారీదారు’గా ప్రకటించింది



సంబంధిత వార్తలు

Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం

Supreme Court On Bulldozer Action: బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్దం..అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని వెల్లడి

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్