Lakhimpur Kheri Violence Case: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ఆశిష్ మిశ్రాకు షరతులతో కూడిన బెయిల్, సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దవుతుందని తెలిపిన సుప్రీంకోర్టు

లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ఆశిష్ మిశ్రాకు షరతులతో కూడిన ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.ఆశిష్ మిశ్రా తన స్థానాన్ని సంబంధిత కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Ashish Mishra. (Photo Credits: IANS)

New Delhi, Jan 25: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ఆశిష్ మిశ్రాకు షరతులతో కూడిన ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.ఆశిష్ మిశ్రా తన స్థానాన్ని సంబంధిత కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆశిష్ మిశ్రా లేదా అతని కుటుంబ సభ్యులు సాక్షులను ప్రభావితం చేయడానికి, విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే అతని బెయిల్ రద్దు చేయబడుతుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని ఎన్‌సిటిలో ఉండకూడదని, బెయిల్‌పై విడుదలైన వారం తర్వాత ఉత్తరప్రదేశ్ విడిచి వెళ్లాలని షరతులతో ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

పథకం ప్రకారమే రైతులపై కారును పోనిచ్చారు, లఖింపూర్ ఖేరి హింసాకాండపై సంచలన విషయాలు బయటపెట్టిన దర్యాప్తు బృందం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో అక్టోబర్ 3l రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పర్యటనలో నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో దూసుకెళ్లాడని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనలో (Lakhimpur Kheri Incident) నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.