Sabarimala & Rafale: మూడు కీలక తీర్పులు నేడే, శబరిమల, రాఫేల్, చౌకీదార్ చోర్ హై పిటిషన్లపై తుది తీర్పు, శబరిమలలో భద్రత కట్టుదిట్టం, అందరి కళ్లు ఈ తీర్పు పైనే..

య తీర్పు( historic verdict on the Ayodhya )ను వెలువరించిన సుప్రీంకోర్టు (Supreme Court ) రాజ్యాంగ ధర్మాసనం నేడు మరో మూడు కీలక తీర్పులను(Sabarimala & Rafale Review Petitions) ఇవ్వనుంది. వీటిలో ఒకటి హిందువుల మత విశ్వాసానికి చెందిన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించే అంశం కాగా. మిగతా రెండు రాజకీయ దుమారం రేపిన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినవి, వీటితో పాటు రాఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని మోడీపై రాహుల్‌ చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలు. ఈ మూడు పిటిషన్లపై దేశ అత్యన్నత న్యాయస్థానం తుది తీర్పును ఇవ్వనుంది.

Sabarimala & Rafale: మూడు కీలక తీర్పులు నేడే, శబరిమల, రాఫేల్, చౌకీదార్ చోర్ హై పిటిషన్లపై తుది తీర్పు, శబరిమలలో భద్రత కట్టుదిట్టం, అందరి కళ్లు ఈ తీర్పు పైనే..
supreme-court-to-verdict-on-sabarimala-review-petition-and-rafale-deal-issues-on-today (Photo-Wikimedia Commons PTI)

New Delhi, November 14: దశాబ్ద కాలం నుంచి నలుగుతూ వచ్చిన అయోధ్య భూవివాదం కేసులో ఏకాభిప్రాయ తీర్పు( historic verdict on the Ayodhya )ను వెలువరించిన సుప్రీంకోర్టు (Supreme Court ) రాజ్యాంగ ధర్మాసనం నేడు మరో మూడు కీలక తీర్పులను(Sabarimala & Rafale Review Petitions) ఇవ్వనుంది. వీటిలో ఒకటి హిందువుల మత విశ్వాసానికి చెందిన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించే అంశం కాగా.. మిగతా రెండు రాజకీయ దుమారం రేపిన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినవి, వీటితో పాటు రాఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని మోడీపై రాహుల్‌ చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలు. ఈ మూడు పిటిషన్లపై దేశ అత్యన్నత న్యాయస్థానం తుది తీర్పును ఇవ్వనుంది.

కేరళలోని శబరిమల (Sabarimala)అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను తప్పుబడుతూ 2018 సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇది మహిళల హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. అయితే, దీనిపై హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మత విశ్వాసాలకు సంబంధించిందని, కేవలం 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు మాత్రమే ప్రవేశంలేదని వాదించారు.  నిఘా నీడలో శబరిమల, తీర్పు నేపథ్యంలో 10 వేలమంది పోలీసులతో పహారా

ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ నాయర్‌ సర్వీసెస్‌ సొసైటీ, దేవస్థాన తంత్రులు, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు సహా పలువురు భక్తులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్‌ వేసింది. దాదాపు 60 పిటిషన్లు దాఖలు కాగా ఫిబ్రవరి 6న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి(Chief Justice of India Ranjan Gogoi) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. నేడు దీనికి సంబంధించిన తుది తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించనుంది.

రెండవది ఫ్రాన్స్ నుంచి 36 రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు 2018 డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరీలతోపాటు సీనియర్‌ లాయర్ ప్రశాంత్‌ భూషణ్‌లు పునఃపరిశీలించాలని కోరుతూ వ్యాజ్యాలు (Rafale review petitins) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పును వెల్లడించనుంది.

పై రెండిండితో పాటు రాఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోడీ ని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ హై (chowkidar chor hai) అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై కూడా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

India Win by 6 Wickets: చివరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు పడటడంతో టెన్షన్ టెన్షన్, పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ, సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ

Virat Kohli World Record: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పరుగుల రికార్డు సొంతం

Share Us