IPL Auction 2025 Live

Padmanabhaswamy Temple: ఆరవ నేలమాలళిగను వారు తెరుస్తారా, అనంతపద్మనాభ స్వామి ఆలయ పాలనపై హక్కులు రాజకుటుంబానికి చెందుతాయని సుప్రీం తీర్పు

ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. స్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టమైన తీర్పు చెప్పింది.

Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, July 13: తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి (Sree Padmanabhaswamy Temple) ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. స్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టమైన తీర్పు చెప్పింది.

ఈ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు (Kerala High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు (Travancore Royal Family) సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి ప్రస్తుతం తీర్పు అనుకూలంగా వచ్చింది. 1991లో ట్రావెన్‌కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు నిలిచియాయని కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును అత్యున్న న్యాయస్థానం రద్దుచేసింది. వాస్తవానికి ఈ కేసుపై విచారణను గతేడాది ఏప్రిల్‌లో పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, తుది తీర్పును సోమవారం వెలువరించింది. రాబోయే రోజులు మరింత ప్రమాదకరం, భవిష్య వాణిని వినిపించిన అమ్మవారు, చరిత్రలో తొలిసారిగా జనం లేకుండా ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర

ఆలయం సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని కేరళ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజవంశం.. తమకే హక్కులు ఉంటాయని వాదించింది. ఈ వాదనలను సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం.. వారికే అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆరోగది తెరవాలా వద్దా అనేది విషయానికి సంబంధించి ట్రావెన్‌కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది.

ఈ ఆలయం 2011లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ గుడిలోని రహస్య తలుపులను తెరవగా అందులో లక్షల కోట్ల విలువైన నిధి నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ గుడి ఒక్కసారిగా దేశంలోనే అత్యంత విలువైన గుడిగా మారిపోయింది. అయితే ఆ గుడిలో అన్నినేలమాలళిగలను తెరిచిన నిపుణులు ఒక నేలమాళిగను మాత్రం తెరవలేదు. ఆ గదిని తెరవాలని కొందరు, తెరవకూడదని మరికొందరు... ఇలా ఎవరి నమ్మకాలకు అనుకూలంగా వారు వాదించారు. దానికి నాగబంధం ఉండటంతో అది తెరిస్తే ప్రళయం వస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఐదు నేలమాళిగలలో బయటపడిన సంపద విలువ సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఆ నేలమాలిగ వద్ద నల్లత్రాచులు పహారా కాస్తున్నట్లు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని తెరిచినవాళ్లను మరణం వెంటాడుతుందన్న కథలు కూడా ఉన్నాయి. 1931లో ఒకసారి ఈ నేలమాలిగను తెరిచే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో దాన్ని తెరిచిన వారు నల్లత్రాచుల నుంచి ప్రాణాలతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టినట్లు ప్రచారంలో ఉన్నది.

కాగా ఆలయ ఆస్తులను ఆడిట్‌ చేసేందుకు నియమితులైన క్యాగ్‌ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఆ కథనాలను కొట్టిపారేశారు. 1990 నుంచి బి నేలమాలిగను ఏడు సార్లు ఓపెన్‌ చేసినట్లు ఆయన తన నివేదికలో వెల్లడించారు.