Surat Businessman: కరోనా బిల్లు ఇచ్చిన షాక్, ఆఫీసును కోవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చేశాడు, మనవరాలు ‘హిబా’ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన సూరత్ వ్యాపారి

ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. ఘటన వివరాల్లోకెళితే.. గుజరాత్ లోని సూరత్ నగరంలో నివసించే వ్యాపార వేత్త ఖాదర్ షేక్‌కు (Surat Businessman Kadar Shaikh) ఇటీవల కరోనా సోకింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రైవేట్ క్లినిక్‌లో 20 రోజులు చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఈ చికిత్స కాలంలో ఆయనకు లక్షల్లో బిల్లు (COVID Bills) వచ్చింది. ప్రయివేటు ఆసుపత్రిలో వచ్చిన ఈ బిల్లును (Shocked by COVID bills) చూసి ఒక‍్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు.

Coronavirus (Photo-PTI)

Surat,July 30: కరోనా సోకిన ఓ వ్యాపార వేత్త కోలుకున్న తరువాత ఆ బిల్లును చూసి షాక్ తిన్నాడు, ఆ షాక్ నుంచి తన ఆఫీసుని ఏకంగా కోవిడ్-19 ఆస్పత్రిగా మార్చివేశాడు. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. ఘటన వివరాల్లోకెళితే.. గుజరాత్ లోని సూరత్ నగరంలో నివసించే వ్యాపార వేత్త ఖాదర్ షేక్‌కు (Surat Businessman Kadar Shaikh) ఇటీవల కరోనా సోకింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రైవేట్ క్లినిక్‌లో 20 రోజులు చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఈ చికిత్స కాలంలో ఆయనకు లక్షల్లో బిల్లు (COVID Bills) వచ్చింది. ప్రయివేటు ఆసుపత్రిలో వచ్చిన ఈ బిల్లును (Shocked by COVID bills) చూసి ఒక‍్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. 105 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, దేశంలో 24 గంటల్లో 52,123 మందికి కోవిడ్-19 పాజిటివ్, ప్రపంచవ్యాప్తంగా 1.69 కోట్లు దాటిన కరోనావైరస్ కేసులు

ప్రాపర్టీ డెవలపర్ అయిన ఖాదర్ షేక్ తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. తన ఆఫీసును పేదవాళ్లకు కరోనా ఆస్పత్రిగా మార్చాలని సంకల్పించాడు. వెంటనే పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా (office into Covid hospital) మార్చారు. తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం ఇప్పుడు కోవిడ్‌-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు.

ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్‌ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు.

వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు.