Surrogacy Bill 2020: ఇకపై మహిళలు తమ గర్భాన్ని అద్దెకివ్వవచ్చు, అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, మలివిడత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌కి రానున్న బిల్లు
మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై (Surrogacy Bill 2020) బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. సమావేశం అనంతరం కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతీ ఇరానీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
New Delhi, February 26: మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై (Surrogacy Bill 2020) బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది.
బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. సమావేశం అనంతరం కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతీ ఇరానీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఇకపై వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ తాజా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ (Broadcasting Minister Prakash Javadekar) మీడియాతో చెప్పారు.వాణిజ్యపరమైన సరోగసీని నిషేధించి, ‘నిస్వార్థమైన’ సరోగసీని అనుమతించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు.
పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆరు కిలో మీటర్లు మోశాడు
భారతీయ దంపతులు మాత్రమే దేశంలో సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని ఎంచుకునేలా ప్రతిపాదనలు పొందుపరిచినట్లు స్మృతీ ఇరానీ తెలిపారు. అబార్షన్ మొదలుకొని సరోగసి వరకూ వేర్వేరు అంశాల్లో మహిళల హక్కులపై ప్రధాని మోదీ విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. వచ్చే నెలలో ప్రారంభంకానున్న మలివిడత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
2019 ఆగస్టులో లోక్‌సభ ఆమోదం పొందిన సరోగసీ ముసాయిదా బిల్లుకు పలు సవరణలు చేసి తాజా బిల్లు తెచ్చారు. అద్దెగర్భానికి అంగీకరించే మహిళ.. దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధనతోపాటు నాటి బిల్లులోని పలు ప్రతిపాదనలపై విమర్శలు రావడంతో కేంద్రం ఆ బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ వివిధ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి పలు సిఫార్సులు చేసింది.
పూట గడవని కూలీ రూ.2.59 లక్షల ట్యాక్స్ కట్టాలట
తాజా బిల్లు ప్రకారం.. అద్దెగర్భం ఇచ్చేందుకు మహిళ సమీప బంధువే కానక్కర్లేదు. అలాగే విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా సరోగసీ ద్వారా బిడ్డను కనొచ్చు. సరోగసీ నియంత్రణకు జాతీయ, రాష్ట్రస్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటుచేస్తారు. సరోగసీకి సిద్ధపడే మహిళకు బీమా సౌకర్యాన్ని 16 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు.
కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలుకు ఆదేశాలు
ఈ సమావేశంలో ఇంకా పలు కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే. దేశం మొత్తానికి అన్వయించే కేంద్ర చట్టాలు (జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి) ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని అప్పట్లో ఒక ప్రకటన వెలువడింది.
కేంద్రం ఆమోదంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. బుధవారం నాటి కేంద్ర కేబినెట్ సమావేశంలో హరియాణా, తమిళనాడుల్లో రెండు ఆహార సంబంధిత సంస్థలకు జాతీయ స్థాయి కల్పిస్తూ నిర్ణయం జరిగింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,మేనేజ్‌మెంట్ చట్టానికి సవరణలు చేశామని జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు తర్వాత ఆ సంస్థలు విదేశీ సంస్థల నుంచి నేరుగా సాయం పొందొచ్చు.
రూ.1,480 కోట్లతో ‘నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్' ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చాబహార్ పోర్ట్ నిర్మాణం సాఫీగా సాగేందుకు మార్గం సుగమం చేస్తూ ‘పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ)’ మార్గదర్శకాల నుంచి ‘ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్)’కు క్యాబినెట్ మినహాయింపునిచ్చింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)