Odisha BJD MLA Manhar Randhari carries pregnant woman on sling for 6 km, drives her to hospital (Photo-Youtube grab)

Bhubaneswar, Febuary 11: ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఎన్నికై ఆ తర్వాత వారి మొహాలు చూసే ప్రజా ప్రతినిధులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని ప్రచారంలో చెప్పి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత కనపడరు. మళ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే ఓటర్లు గుర్తుకువస్తారు. అయితే ఈ ఎమ్మెల్యే మాత్రం ప్రజల మధ్యనే ఉంటున్నారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కథనం. వివరాల్లోకెళితే..

పురిటి నొప్పులు వస్తూ వేదన అనుభవిస్తోన్న ఓ గర్భవతిని (Pregnant woman) ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఆరు కిలోమీటర్లు మోసి ఆస్పత్రిలో చేర్పించారు. ఒడిశాలోని దబూగాంకి చెందిన ఎమ్మెల్యే (Dabugam constituency MLA) మన్హర్ రంధారి (BJD MLA Manhar Randhari) స్థానికంగా ఉన్న గ్రామంలో పర్యటిస్తున్నారు.

20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో జన్మించిన ఒడిశా మహిళ

ఆ సమయంలో నవరంగపూర్ జిల్లా (Nabarangpur) పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర పురిటినొప్పులతో భాదపడుతుందనే విషయాన్ని ఎవరో ఆయనకు చేరవేశారు. దీనికి కారణం అక్కడ సరైన రహదారులు లేవు. ఆస్పతిక్రి ఎలా వెళ్లాలో వారికి తెలియదు.

పూట గడవని కూలీ రూ.2.59 లక్షల ట్యాక్స్ కట్టాలట

ఆయన వెంటనే ఆయన ఆంబులెన్స్‌కి ఫోన్ చేయగా, వారు రోడ్లు బాలేంటూ గ్రామానికి రావడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు.ఇక చేసేదేమిలేకపోవడంతో గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణీని కూర్చోపెట్టి దాదాపు ఆరు కిలోమీటర్లు మోసారు. అనంతరం కారులో గర్భిణీని ఎమ్మెల్యే తరలించారు. తమ కోసం దిగొచ్చి జోలీ మోసిన ఎమ్మెల్యేకు గర్భిణీ కుటుంబసభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రజల ప్రతినిధిగా కష్ట సమయాల్లో వారికి అండగా ఉండాలని అనుకుంటున్నట్లు రాంధారి వెల్లడించారు.

మూడు గంటల్లో రూ.2.7 కోట్లు హాంఫట్ చేసిన మేక

నవరంగపూర్‌ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడ ప్రాంతం పూర్తిగా రవాణ సౌకర్యాలు కూడా లేని మారుమూల ప్రాంతం.ఇప్పటికీ అక్కడ బస్సు సదుపాయం కూడా లేదు. దీంతో చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాంటే నడుచుకుంటూ వెళ్లాల్సిందే.కనీసం అక్కడ ఆస్పత్రి కూడా లేదు. అక్కడ మాత్రమే కాదు. ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

మరుగుదొడ్డే ఆమె నివాసం, నలుగురు కూతుర్లకు అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది

సరియైన రహదారులు లేకపోవడం మూలంగా..అంబులెన్స్‌లు చేరుకోని పరిస్థితి ఉంది. గత నెలలో మావోయిస్టు ప్రభావింత ప్రాంతమైన మల్కన్ గిరి జిల్లాలో (Malkangiri district) అంబులెన్స్ చేరుకోకపోవడంతో వైద్యుడు రాధేశ్యాం స్ట్రెచర్‌పై గర్భిణీని ఏకంగా 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. రాధేశ్యాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పని చేస్తుంటారు.

స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే,  ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేను ప్రశంసిస్తున్నారు. తమ పట్ల మానవత్వం చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.