Swami Chinmayanand Rape Case: లా విద్యార్థినిపై లైంగిక దాడి, స్వామి చిన్మయానంద్‌కు బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు, స్నానం చేసే వీడియోలు చూపించి పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు,,

తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

Swami Chinmayanand (Photo Credits: IANS)

Shahjahanpur, February 3:  న్యాయవాద విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌కు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) బెయిల్ మంజూరు చేసింది. తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. చిన్మయానంద కేసులో ఊహించని మలుపు

షహజన్‌పూర్‌లో లా కాలేజీలోఅడ్మిషన్‌ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్‌ (Swami Chinmayanand) తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే.

కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్‌ వాటిని వైరల్‌ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని (Swami Chinmayanand Rape Case) ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కారాగారానికి తరలించారు.

ANI Tweet:

బాధిత యువతి కొన్ని రోజులు అదృశ్యం అయ్యారు. ఆ తర్వాత ఓ వీడియో ద్వారా ఈ దురాగతాన్ని వెల్లడించారు. పోలీసులు ఈ కేసులో చిన్మయానంద్‌పై సెక్షన్ 376 సీ, సెక్షన్ 354 డీ, సెక్షన్ 342, సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తరువాత భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి బహిష్కరించింది.

చిన్మయానంద్ కేసులో ట్విస్ట్, బాధితురాలు అరెస్ట్

ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ( Uttar Pradesh Government) ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువు కావడంతో న్యాయస్థానం గత ఏడాది నవంబర్‌లో జైలు శిక్ష విధించింది.

అప్పటి నుంచి ఆయన అలహాబాద్ కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. చిన్మయానంద్‌కు బెయిల్ రావడం పట్ల అత్యాచార బాధితురాలి కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ నవీన్ అరోరా (Naveen Arora, Special Investigation Team Chief) గతంలో మాట్లాడుతూ...తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ చిన్మయానంద్‌ అంగీకరించానని తెలిపారు. బాధితురాలిని లైంగికంగా వేధించినట్లు, నగ్నంగా ఉన్న తనకు మసాజ్‌ చేయాల్సిందిగా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు.

విచారణలో భాగంగా చిన్మయానంద్‌ తన నేరాన్ని అంగీకరించారని, తాను చేసిన పనులకు ఇప్పటికే సిగ్గుపడుతున్నానని, ఇక వాటి గురించి ఇంకా ఏం చెప్పలేనంటూ ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయినట్లు వెల్లడించారు.

Here's ANI Tweet

కాగా అడ్మిషన్‌తో పాటు లైబ్రరీలో తనకు ఉద్యోగం ఇప్పించిన చిన్మయానంద్‌ కోరిక మేరకు ఆశ్రమంలో ఆయనను కలిశానని బాధితురాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను హాస్టల్‌లో స్నానం చేస్తున్న వీడియోను చూపి..దాన్ని వైరల్‌ చేస్తానని బెదిరించి ఆయన తనను లోబరుచుకున్నాడని ఆరోపించారు.

అనంతరం లైంగిక దాడి దృశ్యాలనూ రికార్డు చేసిన చిన్మయానంద్‌ వాటిని చూపి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి శిష్యులు తనకు తుపాకీ గురిచూపి ఆయన వద్దకు తీసుకువెళ్లేవారని, ఆయనకు తనతో మసాజ్‌ చేయించేవారని సంచలన ఆరోపణలు చేశారు.