Swati Maliwal Assault Case: స్వాతిమాలీవాల్‌పై దాడి కేసులో ట్విస్ట్, కేజ్రీవాల్ ఇంట్లో సిబ్బందితో స్వాతి మలివాల్ వాగ్వాదం వీడియో వైరల్, ఘటనపై ఎవరేమన్నారంటే..
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ (Swati Maliwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Kejriwal PA Bibhav Kumar) దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
New Delhi, May 17: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ (Swati Maliwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Kejriwal PA Bibhav Kumar) దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
ఢిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. వాంగ్మూలంలో స్వాతి.. బిభవ్‌పై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆప్ (AAP) ఎంపీ ఆరోపించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి, కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడికి సమన్లు పంపిన మహిళా కమిషన్
నా వద్దకు బిభవ్ వచ్చి దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిచా. నన్ను నేను రక్షించుకునేందుకు అతడిని నా కాళ్లతో బలంగా తోసేశా. పరిగెడుతుంటే నా చొక్క పట్టుకుని వెనక్కి లాగాడు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటికి రావడాన్ని బీజేపీ ఓర్వలేకపోతున్నదని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్‌కు చెడ్డపేరు తేవడం కోసం బీజేపీ రకరకాల కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఈ నెల 13న స్వాతి మాలివాల్‌ను కేజ్రీవాల్ నివాసానికి పంపించారని అన్నారు. బీజేపీ కుట్రలో స్వాతి మాలివాల్ పావులా మారిందని మండిపడ్డారు.
వాస్తవానికి సీఎం కేజ్రీవాల్‌ను దోషిని చేయాలని వాళ్లు కుట్ర పన్నారని, కానీ గొడవ జరిగిన సమయంలో కేజ్రీవాల్ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అతిషి వ్యాఖ్యానించారు. అప్పాయింట్‌మెంట్ తీసుకోకుండానే స్వాతిమాలివాల్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారని, అప్పాయింట్‌మెంట్ కాపీ చూపించమని భద్రతా సిబ్బంది అడిగడంతో వారితో గొడవకు దిగారని ఆరోపించారు. సోఫాలో దర్జాగా కూర్చుని పోలీసులను బెదిరించారని చెప్పారు. జోక్యం చేసుకున్న విభవ్ కుమార్‌తో కూడా ఆమె దుర్భాషలాడారని అన్నారు.
పైగా విభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, తనను కాలితో తన్నాడని, బట్టలు చించాడని, తలను టేబుల్‌కేసి కొట్టాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. వాస్తవానికి ఆమెపై దాడి అనేదే జరగలేదని చెప్పారు. ఇవాళ బయటికి వచ్చిన వీడియో క్లిప్పింగే అందుకు నిదర్శనమని అన్నారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవని చెప్పారు.
కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించింది.
Here's Video
Here's MP Tweet
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై స్వాతి మలివాల్ స్పందించింది. తనను తాను రక్షించుకోవడానికి ‘రాజకీయ హిట్‌మ్యాన్’ ప్రయత్నాలు ప్రారంభించాడని ఆరోపించింది. ‘ఎప్పటిలాగే, ఈ రాజకీయ హిట్‌మాన్ మరోసారి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన వ్యక్తులతో ట్వీట్ చేయించడం, సగం వీడియోలను పోస్ట్ చేయించడం ద్వారా ఈ నేరం నుంచి తప్పించుకోగలనని అతడు భావిస్తున్నాడు. ఒకరిని కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు? ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఏ స్థాయికి దిగజారాలని కోరుకుంటున్నావో? దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది’ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మహిళా కమిషన్‌కి ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడానికి ఆప్ కారణమని.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలని ఘాటు విమర్శలు చేశారు.
కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిని ఆ పార్టీ ఎంపీ స్వాతీమలీవాల్‌ను శుక్రవారం తీస్ హజరీ కోర్టులో వివరించారు. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టులో సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు. తనపై దాడి చేసిన బిభవ్ కుమార్‌పై మలివాల్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై బిభవ్ కుమార్ జరిపిన దాడిని ఎక్స్ వేదికగా స్వాతి మలివాల్ వివరించారు. అయితే ఈ దాడి ఘటన తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందించడం ఇదే తొలిసారి. అలాగే ఈ దాడి జరిగిన మూడు రోజులకు పోలీస్ స్టేషన్‌లో బిభవ్ కుమార్‌పై ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ నెల 13న కేజ్రీవాల్ నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై స్వాతి (Swati Maliwal) గురువారం తొలిసారిగా స్పందించారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకు విజ్ఞప్తి చేశారు.
స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. ‘‘స్వాతిపై దాడి జరిగింది. కేజ్రీవాల్ చెప్పింది చేయడమే బిభవ్ పని. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను నేనూ సహించాల్సి వచ్చింది. అక్కడ కొట్టడం మామూలే. ప్రశాంత్ కుమార్, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్లను బౌన్సర్లలతో గెంటేశారు. ఈ సారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టంచడం తగినదేనా? ఇంత జరిగాక కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడం సరికాదు. ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)