Greater Noida: స్విగ్గీ ఆర్డర్ లేట్, తాగిన మత్తులో రెస్టారెంట్ యజమానిని కాల్చేసిన డెలివరీ ఏజెంట్, గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన, డెలివరీ ఏజెంట్ కోసం గాలిస్తున్న పోలీసులు
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్.. రెస్టారెంట్ ఓనర్‌ను (Kills Restaurant Owner ) చంపాడు. ఆర్డర్ ఆలస్యమైన కారణంగా అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు (Swiggy Delivery Boy Shoots) పోలీసులు వెల్లడించారు.
Noida, September 1: గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్.. రెస్టారెంట్ ఓనర్‌ను (Kills Restaurant Owner ) చంపాడు. ఆర్డర్ ఆలస్యమైన కారణంగా అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు (Swiggy Delivery Boy Shoots) పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ డెలివరీ ఏజెంట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సునీల్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని (Greater Noida) మిత్రా సొసైటీలో జామ్ జామ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆర్డర్‌ను పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు వచ్చాడు.
ఒక ఆర్డర్‌ను వెంటనే ఇచ్చిన రెస్టారెంట్‌లో పని చేసే వ్యక్తి.. మరో ఆర్డర్ లేటవుతుందని చెప్పాడు. దీంతో సదరు ఏజెంట్ ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవను అడ్డుకోబోయిన యజమాని సునీల్‌ను ఆ స్విగ్గీ డెలివరీ బోయ్ కాల్చాడు.
వెంటనే సునీల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినా.. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ డెలివరీ ఏజెంట్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వాళ్లు అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.