CM M. K. Stalin: సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం, ఇకపై ప్రజల వాహనాలతోనే సీఎం కాన్వాయ్, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తన కాన్వాయ్ వాహనాలు సగానికి తగ్గించిన తమిళనాడు ముఖ్యమంత్రి
K. Stalin) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను (fewer vehicles in convoy ) తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో ఈ చర్యలు తీసుకున్నారు.
Chennai, Oct 10: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM M. K. Stalin) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను (fewer vehicles in convoy ) తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆయన కాన్వాయ్‌లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితాన్ని కాంక్షించే విధంగా స్టాలిన్ (Tamil Nadu Chief Minister M K Stalin) ముందుకు సాగుతున్నారు.
ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీని గుర్తించిన స్టాలిన్ తన కాన్వాయ్ వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గించేశారు. ఇక ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్‌ను ఎక్కడా నిలపరు. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కాన్వాయ్ సాగే విధంగా ఆదివారం నుంచి చర్యలు తీసుకోనున్నారు. సచివాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు సీఎం వీల్‌చైర్‌లు, స్కూటర్లను పంపిణీ చేశారు. అదేవిధంగా స్కూటర్ల మరమ్మతుల నిమిత్తం రూ. 1,500 సాయంకు శ్రీకారం చుట్టారు. అలాగే, దివ్యాంగుల రిజర్వేషన్ కింద ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు.
అధికారిక ప్రకటన ప్రకారం నెలవారీ మంజూరు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. చీఫ్ సెక్రటరీ వి.ఇరాయ్ అన్బు, వికలాంగుల శాఖ సంక్షేమ కార్యదర్శి ఆర్. లాల్వేన, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత, ముఖ్యమంత్రి తిరువళ్లూరు జిల్లాలోని కొల్లపంచేరిలో కొత్తగా ఏర్పాటు చేసిన సంకల్ప్ - లెర్నింగ్ సెంటర్ & స్పెషల్ నీడ్స్ స్కూల్ - వర్చువల్ ఈవెంట్ ప్రారంభించారు.