Free Laddu Distribution Scheme: మీనాక్షి ఆలయంలో భక్తులకు ఉచితంగా లడ్డులు, కార్యక్రామన్ని ప్రారంభించనున్న తమిళనాడు సీఎం పళనిస్వామి, పొరుగు రాష్ట్రాల నుంచి లడ్డు తయారీ యంత్రాల దిగుమతి
ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎడ ప్పాడి పళనిస్వామి(Tamil Nadu chief minister Edapaddi K Palaniswami) శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు.
Madurai, November 8: తమిళనాడులోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయం(Sri Meenakshi Sundareswarar Temple)లో భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని(Free Laddu Distribution Scheme) అందించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎడ ప్పాడి పళనిస్వామి(Tamil Nadu chief minister Edapaddi K Palaniswami) అధికారికంగా ప్రారంభించారు. కాగా మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు.
శబరిమలై సీజన్ లో అయ్యప్ప భక్తుల రద్దీ ఇక్కడ అధికంగా వుంటుంది. అధ్భుత శిల్ప కళా నైపుణ్యంతో ఈ ఆలయం ఉట్టిపడుతూ ఉంటుంది. భక్తులనే కాకుండా పర్యా టకులను కూడా ఈ ఆలయం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పంపకానికి సిద్ధంగా ఉన్న లడ్డులు
ఈ క్రమంలో దీపావళి నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదంగా అందించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి లడ్డు తయారీ యంత్రాలను కూడా దిగుమతి చేశారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు చేపట్టారు.
దీనిపై ఆలయ అధికారి కరు ముత్తుకన్నన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆలయ ప్రాంగణం లోని స్టాల్స్‌లో 60 గ్రాముల బరువున్న లడ్డు విక్రయి స్తున్న ట్లు తెలిపారు. ఇకపై 30 గ్రాముల లడ్డును ఉచితం గా శుక్రవారం నుంచి భక్తులకు అందించనున్నట్లు తెలిపారు.
మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు చొక్క నాధర్‌ను దర్శించుకుని వచ్చే మార్గంలో వినాయక సన్నిధి సమీపం నవరాత్రి కొలువును ఏర్పాటు చేసే ప్రదేశంలో ఉచిత లడ్డు ప్రసాదం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం ఆలయం తెరిచినప్పటి నుంచి రాత్రి పూజా కార్యక్రమాలు ముగిసే వరకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పండుగ రోజుల్లో కూడా ఈ ప్రసాదం పంపిణీ చేస్తామని, ఆలయానికి వచ్చే ఆదాయం నుంచి లడ్డు తయారీకి నగదు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.